ఆయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి చాలా మంది సెలబ్రిటీలు వెళ్లారు. కానీ తెలుగు నుంచి మోహన్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారు వెళ్లకపోవడానికి షాకింగ్ రీజన్స్ బయటకు వచ్చాయి.
మూడు రోజుల క్రితం అయోధ్యరామ మందిరం ప్రారంభోత్సవం చాలా గ్రాండ్‌గా జరిగింది. చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. కానీ తెలుగు నుంచి చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే అటెండ్ అయ్యింది. అయితే ప్రభాస్, మోహన్‌బాబు, ఎన్టీఆర్ లకు ఆహ్వానం అందినా వెళ్లలేదనే ప్రచారం జరిగింది.
26
ఇదిలా ఉంటే దీనికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రభాస్‌కి ఆహ్వానం ఉన్నా వెళ్లకపోవడానికి ఆయన అనారోగ్యం కారణం అని తెలుస్తుంది. ఆయన కాలు గాయంతో చాలా కాలంగా బాధ పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకి వెళ్లలేదని తెలుస్తుంది.
36
మోహన్‌బాబు.. తనకు ఆహ్వానం అందిందని, సెక్యూరిటీ ఇస్తామని చెప్పినా, ఆ క్రౌడ్‌లో వెళ్లడం తనకు ఇష్టం లేదని, అందుకే వెళ్లలేదని వెల్లడించారు. కానీ అందిన సమాచారం మేరకు మోహన్‌బాబకి అసలు అయోధ్య ఆహ్వానమే లేదని తెలుస్తుంది. అదే సమయంలో ఈ విషయం సోషల్ మీడియాలో రూమర్‌గానూ వినిపిస్తుంది. సీఎం స్థాయి వ్యక్తులకు ఆహ్వానం లేదు, మోహన్‌బాబుకి ఎలా ఇస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
46
అంతేకాదు ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందిందనే ప్రచారం జరిగింది, ఆయన ఎందుకువెళ్లలేదనే ఆరా తీయడం స్టార్ట్ అయ్యింది. కానీ తారక్ కూడా ఆహ్వానం అందలేదని సమాచారం. గతంలో బీజీపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి డైరెక్ట్ గా ఎన్టీఆర్‌తో భేటీ అయ్యాడు. దీంతో బీజేపీకి తారక్ సానుకూలంగా ఉన్నారనే ప్రచారం ప్రారంభమైంది. ఆయనకు ఆహ్వానం ఉంటుందని తెలిసింది. కానీ ఆయనకు కూడా ఆహ్వానం లేదని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
56
అంతేకాదు లెజెండరీ సినిమా రైటర్‌గా, రాజ్యసభ ఎంపీగా, `ఆర్‌ఎస్‌ఎస్`పై సినిమా చేయబోతున్న విజయేంద్రప్రసాద్ కి కూడా ఆహ్వానం రాలేదని టాక్. ఆయన వెళ్లకపోవడానికి కూడా కారణం అదే అంటున్నారు. అయితే దీనిపై విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు సినిమా నుంచి చిరంజీవి వెళ్లడమే బెస్ట్, ఆయనే రిప్రజెంట్ చేస్తారు, ఆయనే సరైన వ్యక్తి అని తెలియజేయడం విశేషం.
66
Chiranjeevi, Ram Charan in Ayodhya
టాలీవుడ్ నుంచి ఆయోధ్యకి మెగా ఫ్యామిలీ మాత్రమే రిప్రజెంట్ చేసింది. చిరంజీవి ఫ్యామిలీ ఆయోధ్య వేడుకలో పాల్గొంది. చిరుతోపాటు ఆయన సతీమణి సురేఖ, రామ్‌చరణ్ వెళ్లారు. ఇక రాజకీయకోటాలో, బీజేపీతో మంచి అనుబంధం ఉన్ననేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కి కూడా ఆహ్వానం అందింది. ఆయన కూడా పాల్గొన్నారు. వీరితోపాటు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఆయన బీజేపీ నాయకుడిగా, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉన్నారు.