తండ్రి లేడు, ఒంటరి పోరాటం.. `మిస్‌ యూనివర్స్-2023` పోటీపడుతున్న శ్వేత శారద బ్యాక్‌ గ్రౌండ్‌ తెలుసా?

2023కి సంబంధించి మిస్‌ యూనివర్స్ అందాల పోటీలకు ఇండియా నుంచి శ్వేతా శారద పోటీ పడుతుంది. అయితే ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటనేది ఇప్పుడు వైరల్ అవుతుంది.  

no father lonely struggle do you know background of miss universe 2023 contestant shweta sharda ? arj

మిస్‌యూనివర్స్ 2023కి సంబంధించిన పోటీలు జరుగుతున్నాయి. నేడు (నవంబర్‌ 18)న టైటిల్‌ విన్నర్‌ ఎవరో తేలనుంది. అయితే ఈ సారి మిస్‌ యూనివర్స్ అందాల పోటీలకు ఇండియా నుంచి శ్వేత శారద అనే మోడల్‌ పోటీ పడుతుంది. 2021 తర్వాత ఇండియా నుంచి మిస్‌ యూనివర్స్ అందాల పోటీల్లో ఇండియాకి చెందిన మోడల్‌ ఫైనల్‌కి చేరడం విశేషం. వివిధ దేశాల నుంచి 85 మంది మోడల్స్ ఈ అందాల పోటీలకు పోటీ పడుతున్నారు. 

ఇందులో మన భారత్‌కి చెందిన శ్వేత శారద ఈ పోటీల్లో ఉండటంతో అందరిలోనూ ఆశలు నెలకొన్నాయి. ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలుస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సందర్భంగా ఈ శారదా ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటనేది వెతికే పనిలో పడ్డారు ఆడియెన్స్. దీంతో శ్వేత శారత పర్సనల్‌ డిటెయిల్స్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఆమె పర్సనల్‌ లైఫ్‌ చాలా ఎమోషనల్‌గా ఉంది, లైఫ్‌లో ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. ఒంటరి పోరాటం ఉంది.
 


శ్వేతా శారదాది చండీగఢ్‌. ఆమె 2000, మే 24న జన్మించారు. తండ్రి లేరు. ఒంటరి తల్లి వద్ద పెరిగింది. ఈ క్రమంలో ఎంతో స్ట్రగుల్‌ అయ్యారు. తనని తాను మల్చుకుంటూ, తల్లి సహకారంతో ముందడుగు వేస్తూ 16ఏళ్ల వయసులో చండీగఢ్‌ నుంచి ముంబయికి షిఫ్ట్ అయ్యారు. అలాగే ఢిల్లీలోనే గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యూయేట్‌ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే ఆమె మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు. దీంతోపాటు డాన్సు దీవానే, డాన్స్ ప్లస్‌, డాన్సు ఇండియా డాన్స్ వంటి డాన్స్ రియాలిటీ షోస్‌లో పాల్గొంది. ఈ అనుభవంతో `ఝలక్‌ దిఖ్లా జా`కి కొరియోగ్రాఫర్‌గానూ వ్యవహరించడం విశేషం.
 

చాలా రోజులుగా మోడల్‌గా చేస్తూ పలు అందాలు పోటీల్లో పాల్గొంటూ వస్తుంది శ్వేత. ఆమె ఆగస్ట్ లో జరిగిన మిస్‌ యూనివర్స్ ఇండియా 2023 పోటీల్లో అందాల కిరీటాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో మిస్‌ యూనివర్స్ 2023 పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఆ సమయంలో శారదా మాట్లాడుతూ, తన ఎదుగుదలకు, తాను ఈ స్థాయికి రావడానికి కారణం తన తల్లి అని చెప్పింది. ఆమె తనన ఎంతో ప్రభావితం చేసినట్టు ఎమోషన్ వర్డ్స్ వెల్లడించింది.
 

అంతేకాదు సినిమాల్లో తాను దీపికా పదుకొనె, మాధురీ దీక్షిత్‌లకు స్టెప్పులు నేర్పించే అవకాశాన్ని కూడా అందుకుందట. ఆ విషయాలను పంచుకుంటూ `నేను టెలివిజన్‌ లో, సిల్వర్ స్క్రీన్‌పై చూసిన దీపికా పదుకొనె, సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, మౌని రాయ్‌, వైభవి మర్చంట్‌, ఎవర్‌ గ్రీన్‌ దివా మాధురీ దీక్షిత్‌ వంటి భారత అత్యంత ప్రేమ గల నటీనటులతో పనిచేయడం, వారికి నా డాన్సు నేర్పించే అవకాశం రావడం` గర్వంగా ఉంది అని తెలిపింది. 
 

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె ఫైనల్‌ అందాల పోటీల్లో పాల్గొనబోతుంది. మరికొన్ని గంటల్లో ఆ లెక్క తేలనుంది. మరి ఈ సారికూడా ఇండియాని మిస్‌ యూనివర్స్ వరిస్తుందా అనేది చూడాలి. ఆమెకి అంతా అభినందనలు తెలియజేస్తున్నారు. గతంలో మిస్‌ యూనివర్స్ గెలిచిన వారిలో సుస్మితా సేన్‌(1994), లారా దత్తా(2000), హర్నాజ్‌ కౌర్‌ సందు(2021)లో విన్నర్స్ గా నిలిచారు

Latest Videos

vuukle one pixel image
click me!