ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నివేదా థామస్ ఫోటోలను, వీడియోలను మిస్ యూజ్ చేసిన నేపథ్యంలో తాజాగా నటి స్పందించింది. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇకపై కటకటాలకే అని చెప్పింది.
ఫేక్ వీడియోలపై స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మిక
ఏఐ ఇప్పుడు అనేక రకాలుగా ఉపయోగపడటంతోపాటు అనేక అనర్థాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఇది సెలబ్రిటీలకు చాలా ఇబ్బందిగా మారింది. ఏఐ ఉపయోగించి ఫేక్ ఫోటోలు, వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది బాగా మిస్ యూజ్ అవుతుంది. చాలా అసభ్యకరంగా వారి ఫోటోలు, వీడియోలను మారుస్తున్నారు. అందుకే చాలా మంది స్టార్స్ తమ పేరు, ఫోటోలను మిస్ యూజ్ చేస్తే కఠిన చర్యలుంటాయని కోర్ట్ ద్వారా హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో రష్మిక మందన్నా ఫేక్ వీడియో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి యాక్షన్ తీసుకుంది. అలాగే చాలా మంది హీరోయిన్లు ఇలాంటి ఫేక్ ఫోటోల బారిన పడ్డారు.
25
ఇటీవల శ్రీలీల సైతం ఏఐ బారిన పడింది
ఇటీవల శ్రీలీలకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఫేక్ ఫోటోలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. `నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఏఐ జనరేటెడ్ ఫేక్ కంటెంట్ని సపోర్ట్ చేయవద్దు. టెక్నాలజీని ఉపయోగించడం, దుర్వినియోగం చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. టెక్నాలజీని అభివృద్ధి వైపు ఉపయోగించి జీవితాన్ని సరళీకరించాలి, దాన్ని భయంకరంగా మార్చవద్దు` అని శ్రీలీల వెల్లడించింది.
35
ఇప్పుడు ఏఐ ఫేక్ కంటెంట్ బారిన పడ్డ నివేదా థామస్
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి అనుభవమే మరో నటి నివేదా థామస్ కి ఎదురయ్యింది. తన ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, తన అనుమతి లేకుండా ఇలాంటి కంటెంట్ సృష్టించడం తనని తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించింది. ఇది తన వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే తన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్‌ని గుర్తిస్తే, వాటిని ఎవరికీ షేర్ చేయవద్దని కోరింది.
అనవసరమైన వాటిని షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దని వార్నింగ్ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నివేదా అదిరిపోయేలా వార్నింగ్ ఇచ్చింది. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఇక కటకటాలకే అని స్వీట్‌గా చెప్పింది నివేదా. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
55
ఒక్క ఫోటోతో ఇంటర్నెట్ షేక్
నివేదా థామస్ `జెంటిల్‌మేన్`, `నిన్నుకోరి` వంటి చిత్రాలతో పాపులర్ అయ్యింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత `వకీల్ సాబ్`లోనూ మెరిసింది. ఇటీవల `35 చిన్న కథ కాదు` చిత్రంలో నటించి ప్రశంసలందుకుంది. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న నివేదా థామస్. ఇటీవల శారీలో దిగిన ఫోటోని పంచుకోగా, అది సోషల్ మీడియాని షేక్ చేసింది. నివేదా అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.