Illu Illalu Pillalu Today Episode Dec 18: ఇంట్లో పెద్ద చిచ్చే పెట్టిన వల్లి, ధీరజ్ పై కత్తి ఎత్తిన ప్రేమ

Published : Dec 18, 2025, 09:31 AM IST

Illu Illalu Pillalu Today Episode Dec 18: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో వల్లి ఇంట్లో కొత్త చిచ్చు పెట్టేందుకు సిద్ధమైంది. సాగర్ కు లేనిపోనివి చెప్పి గొడవలు పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
15
వల్లికి ఉద్యోగం వెతికిన రామరాజు

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రేమ.. రామరాజుతో మాట్లాడుతూ వల్లి అక్కకి ఉద్యోగం కోసం మీకు తెలిసిన స్కూల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేయమని చెబుతుంది. అది విని వల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయ్ తెగ భయపడి పోతారు. అదే సమయానికి కావాలనే వల్లి తుమ్ముతుంది. తుమ్మినప్పుడు ఏ పని మొదలు పెట్టకూడదని చెబుతుంది. కానీ నర్మద, ప్రేమ మాట్లాడుతూ ఇప్పుడు అమృత ఘడియలు ఈ సమయంలో వల్లి అక్కకి జాబ్ గురించి మాట్లాడితే.. ఇక ఆమెని ఆపే వారే లేరు.. మీరు ఫోన్ చేయండి అని చెబుతారు. దీంతో రామరాజు ఆయనకి ఫోన్ చేసి ‘నా పెద్ద కోడలు ఎమ్ఏ ఇంగ్లీష్ చదివింది. స్కూల్లో ఏదైనా ఉద్యోగం ఉంటే ఇస్తారని చేశాను’ అని చెబుతాడు. రామరాజుకి ప్రిన్సిపల్ లో ఇంటర్వ్యూకి రమ్మని పిలుస్తాడు. రామరాజు అనే విషయాన్ని వల్లికి చెబుతాడు. వల్లి భయపడిపోతుంది. 

అదే సమయంలో ప్రేమ, నర్మదా వల్లిని చేతులు పట్టుకొని ఇటూ అటూ తిప్పేస్తూ కంగ్రాట్యులేషన్స్ చెబుతారు. వల్లి ఎవరికీ వినిపించకుండా చిన్నపిల్లను చేసి నాతో ఇలా ఎందుకు ఆడుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు నర్మద, ప్రేమ మాట్లాడుతూ నీతో ఒక ఆట ఆడుకుంటాము, నీతో జాబ్ చేయించడమే మా ప్లాను అని చెబుతారు. రామరాజు వల్లి తో మాట్లాడుతూ ‘ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నాకు బాగా తెలుసు. నువ్వు బాగా ఉద్యోగం చేసి నా పేరు నిలబెట్టాలి’ అని చెబుతాడు. దానికి వల్లి ఇబ్బందిగానే ఓకే అని చెబుతుంది. అందరూ ఎవరు పనుల మీద వారు వెళ్ళిపోతారు. ఇక హాల్లో నర్మద, ప్రేమ మిగులుతారు.

25
కత్తి ఎత్తిన ప్రేమ

నర్మద, ప్రేమ ఆనందంతో నవ్వుకుంటారు. ఇక వల్లి పారిపోతున్న భాగ్యం, ఇడ్లీ బాబాయ్ వెంట పడుతుంది. మీరు సర్టిఫికెట్లు తెచ్చి ఇవ్వడం వల్లే నాకు ఈ సమస్య వచ్చిందని తిడుతుంది. వాళ్ళిద్దరూ ఆగకుండా తమ ఇంటికి పారిపోతారు. ఇక్కడ నుంచి సీన్ ధీరజ్ దగ్గరికి మారుతుంది. ధీరజ్ రాత్రంతా బాగా తాగి ఉదయాన్నే లేస్తాడు. అప్పటికే ప్రేమ ఎదురుగా చేతిలో గొడ్డలి పట్టుకొని కూర్చుంటుంది. రాత్రంతా నువ్వు చేసిన పనులు ఏమిటో తెలుసా అని అడుగుతుంది. ‘నువ్వు రాత్రి నాకు ముద్దులు పెట్టావు.. బయటికి ఏమో ప్రవరాఖ్యుడిలా ఏమీ తెలియనట్టు ఉంటావు, కానీ నీలో ఒక మన్మధ రాజా ఉన్నాడు’ అంటూ ధీరజ్ ను తిడుతుంది. ప్రేమ గొడ్డలి పట్టుకొని నరికేస్తానంటూ మీదకు వెళుతుంది. చివరికి ధీరజ్ కు తాను ముద్దు పెట్టిన సంగతి గుర్తుకొస్తుంది. వీరిద్దరి గిల్లికజ్జాలు కాసేపు సాగుతాయి. నాకు ముద్దు పెట్టడం వెనక మీ ఇంటెన్షన్ ఏంటి అని అడుగుతుంది ప్రేమ. కానీ ధీరజ్ ఏమీ చెప్పడు. దాంతో కాసేపు చితక్కొడుతుంది.

35
బస్తాలు మోసేవాడికి ఈ డ్రెస్సేంటి?

ఇక ఇక్కడ నుంచి సీన్ సాగర్ దగ్గరికి మారుతుంది. సాగర్ నీట్ గా రెడీ అయి బయటికి వస్తాడు. ఏదో ఒకటి చేసి పదిహేను లక్షలు సమకూర్చుకోవాలి అని మనసులో అనుకుంటాడు. బయటికి వెళ్తుంటే రామరాజు ఎక్కడికని అడుగుతాడు. రైస్ మిల్లుకు వెళ్లకుండా బయటకి ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నిస్తాడు. ఏదో ఉద్యోగానికి వెళ్తున్నట్టు డ్రెస్సింగ్ ఏంటి అలా చేసుకున్నావ్? రైస్ మిల్లుకు ఎలా వెళ్లాలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా తెలియదా అని ప్రశ్నిస్తాడు. ఈ లోపు వేదవతి వచ్చి ఈ బట్టల్లో నా కొడుకు దొరబాబు లాగా ఉన్నాడు అని మెచ్చుకుంటుంది.

 ‘రైస్ మిల్లులో పనికి ఇలాంటి బట్టలు పనికిరావు.. అప్పుడప్పుడు బస్తాలు మోయాల్సి వస్తుంది. అప్పుడు దుమ్ము ధూళి అంటుకుంటుంది. బట్టలు మాసిపోవా’ అని అంటాడు రామరాజు. దానికి సాగర్ చాలా బాధపడతాడు. ఈమధ్య రైస్ మిల్లు వదిలేసి బయట తిరగుళ్లు ఎక్కువైపోయాయి అని అంటాడు రామరాజు. ఏ పనీ చేతకాని సన్నాసిలా తయారైతున్నాడు అని అనగానే సాగర్ చాలా ఫీల్ అవుతాడు. ఇదంతా నర్మద వింటూ ఉంటుంది.

45
సాగర్ ను తిట్టిన రామరాజు

వేదవతి మాత్రం సాగర్ ను వెనకేసుకొస్తుంది. ఎదిగిన కొడుకుని ఎందుకు తిడుతున్నావ్ అని అడుగుతుంది. తర్వాత రామరాజు సాగర్ తో ‘ఎందుకు ఇలా నిల్చున్నావు వెళ్లి బట్టలు మార్చుకొని రా.. చేతకాని వెధవ’ అని గట్టిగా అరుస్తాడు. దాంతో సాగర్ చాలా ఫీల్ అయిపోయి ఇంట్లోకి వెళ్తాడు. నర్మద ఇదంతా వింటుంది. అప్పుడు వేదవతి ఇంట్లోకి వెళుతుండగా నర్మద ఆపుతుంది. ‘మీ ఆయన.. మా ఆయనను ఏదో ఒకటి అంటూనే ఉంటారు మీరు ఏమి మాట్లాడరా’ అని అడుగుతుంది. ఈ లోపు పాత బట్టలు వేసుకొని సాగర్ బండి దగ్గరికి వస్తాడు. మళ్ళీ రామరాజు ఆపుతాడు. సాగర్ గట్టిగా ఏంటి నాన్న అని ప్రశ్నిస్తాడు. 

దాంతో రామరాజు వేరే వ్యక్తికి డబ్బులు ఇవ్వమని చెప్పి వెళ్లిపోతాడు. సాగర్ తనలో తానే తిట్టుకుంటూ బయలుదేరుతాడు. వేదవతి.. సాగర్ ను బుజ్జగించడానికి ప్రయత్నిస్తుంది. అందరూ లోపలికి వెళ్ళిపోయాక నర్మద, సాగర్ బయట మిగులుతారు. నర్మద మాట్లాడుతూ ‘హలో సార్ ఎక్కువ ఫీల్ అవ్వకండి. రోజూ జరిగేది ఇదే కదా.. మనం చేసేదేమైనా ఉందా’ అని అంటుంది. ప్రశాంతంగా రైస్ మిల్లు కి వెళ్ళు అని చెబుతుంది. నర్మద తన ఉద్యోగానికి వెళ్లిపోతుంది.

55
సాగర్ ను రెచ్చగొట్టిన వల్లి

అందరూ వెళ్లిపోయాక సాగర్ అక్కడ ఉంటాడు. ఇక్కడ జరిగిందంతా వల్లి చూస్తుంది. వల్లి గొడవలు పెట్టేందుకు సిద్ధమవుతుంది. బాధపడుతున్న సాగర్ దగ్గరికి వచ్చి వల్లి మాట్లాడుతూ ‘మీ నాన్నగారు అన్న మాటలకి బాధపడుతున్నారా? ఏం చేస్తాం.. రైస్ మిల్లులో మూటలు మోస్తున్నావని బయటి వారైనా మీ మామయ్య అంటేనే మీరు భరించలేకపోతున్నారు. అట్లాంటిది ఆ మాటలు కన్నతండ్రి అంటే ఎట్టా తట్టుకోగలరు లెండి? వీళ్ళ మాటలకే ఇంత బాధపడితే ఇక నర్మద మనసులో ఉన్న బాధ తెలిస్తే ఇంకెంత ఫీల్ అయిపోతావో’ అని అంటుంది. అది వినగానే సాగర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నర్మద మనసులో బాధ ఏముందని అడుగుతాడు సాగర్. 

అప్పుడు వల్లి మాట్లాడుతూ ‘తన భర్త రైస్ మిల్లులో మూటలు మోసే పని చేస్తున్నాడని నర్మద కూడా చాలా బాధపడుతుంది. నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉంటే నా భర్త రైస్ మిల్లులో పనిచేస్తున్నాడని ఎంతో ఫీల్ అయిపోతోంది. నా దగ్గరే నర్మద తన బాధను చెప్పుకొని బాధపడింది’ అని పెద్ద చిచ్చే పెట్టింది. వల్లీ పెట్టిన ఈ చిచ్చు ఇంట్లో ఎంత గొడవకు కారణం అవుతుందో చూడాలి. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది

Read more Photos on
click me!

Recommended Stories