సినిమాలు మానేసి నివేతా పేతురాజ్‌ చేసే పని ఇదా!.. విశ్వక్‌ సేన్‌ హీరోయిన్‌లో టాలెంట్‌ మామూలుగా లేదుగా..

Published : Jan 23, 2024, 11:45 PM IST

విశ్వక్‌ సేన్‌ హీరోయిన్‌ నివేతా పేతురాజ్‌ ఇప్పుడు సినిమాలు మానేసింది. ఆమె కనిపించక ఏడాది పైనే అవుతుంది. కానీ ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ని చూపించి షాకిచ్చింది.   

PREV
15
సినిమాలు మానేసి నివేతా పేతురాజ్‌ చేసే పని ఇదా!.. విశ్వక్‌ సేన్‌ హీరోయిన్‌లో టాలెంట్‌ మామూలుగా లేదుగా..

నివేతా పేతురాజ్‌.. `మెంటల్‌ మదిలో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకుంది. అందరి దృష్టిని ఆకర్షించింది. అడపాదడపా తెలుగులో సినిమాల చేస్తూ వచ్చింది. `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా` చిత్రాలతో విజయాలు అందుకుంది. `అల వైకుంఠపురములో` మూవీలో సెకండ్‌ లీడ్‌గా చేసింది. 
 

25

ఆ తర్వాత చేసిన `రెడ్‌`, `పాగల్‌` మూవీస్‌ డిజప్పాయింట్‌ చేశాయి. `విరాటపర్వం`లో గెస్ట్ గా మెరిసింది. ఇక గతేడాది `దాస్‌ కా ధమ్కీ`లోనూ మెరిసింది. ఇవన్నీ పెద్దగా ఆడలేదు. అయితే విశ్వక్‌ సేన్‌తో రెండు సినిమాలు చేసి.. మాస్‌ కా దాస్‌ హీరోయిన్‌గా మారిపోయింది. కానీ అనూహ్యంగా ఆమె సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడు తెలుగులో ఒక్క మూవీ కూడా లేదు. తమిళంలో ఓ మూవీ విడుదల కావాల్సి ఉంది. కొత్తగా మరే సినిమాకి సైన్‌ చేయలేదు. 
 

35

దీంతో నివేతా పేతురాజ్‌ సినిమాలకు దూరమవుతుందా? లేక ఆఫర్లు రావడం లేదా అనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పెద్ద సర్‌ప్రైజ్‌తో కూడిన షాకిచ్చింది. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా కనిపించి ఆశ్చర్యపరించింది. 
 

45

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఫోటోలను పంచుకుంది. ఇందులో ఛాంపియన్‌గా నిలిచింది నివేతా. నెక్ట్స్ ఏంటి అంటూ.. బాడ్మింటన్‌ మిక్స్ డబుల్స్ లో ఛాంపియన్‌గా నిలిచినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇక తర్వాత ఏం సాధించాలనే అర్థంలో ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో నివేతాని ఇలా చూసిన వారంతా ఆశ్చర్యపోతూ ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. 
 

55

నివేతా ఇప్పటికే F1 కార్ రేసర్ గా రాణించింది. ఫార్ములా కార్ రేసింగ్ లో పలు పతకాలు కూడా సాధించింది. ఇప్పుడు బ్యాడ్మింటన్(Badminton) లో కప్పు కొట్టింది. తమిళనాడులో జరిగిన స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో మధురై తరపున డబుల్స్ ఆడి విన్నర్ గా నిలిచింది. మరి ఇది చూసిన వారంతా ఇక స్పోర్ట్స్ లోనే కంటిన్యూ అవుతావా? సినిమాలు చేస్తావా? అని అడుగుతున్నారు. అభిమానులు మాత్రం మళ్లీ సినిమాలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories