అలా చేస్తే రామ్‌చరణ్‌ ది సైడ్‌ రోలే.. రాజమౌళి అంత మాట అనేశాడేంటి?.. మొత్తం రచ్చ రచ్చ..

First Published | Jan 23, 2024, 10:01 PM IST

 తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడారు. ఇందులో `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రస్తావన వచ్చింది.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటించారు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రమిది. రెండేళ్ల క్రితం విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. `బాహుబలి 2` తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో తెలుగు సినిమాగా నిలిచింది. ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ లకు మంచి పేరొచ్చింది. నటులుగా దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు. అంతర్జాతీయంగానూ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా `నాటునాటు` సాంగ్‌ ప్రపంచాన్నే ఊపేసింది. 

అయితే ఈ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు ఉండటంతో ఎవరు గొప్ప, ఎవరి రోల్‌ ఎక్కువ, ఎవరిది తక్కువ అనే చర్చ పెద్దగానే జరిగింది. బీభత్సమైన ట్రోలింగ్‌ జరుగుతుంది. ఇద్దరు హీరోల అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కొట్టుకున్నారు. అయితే చాలా వరకు రామ్‌చరణ్‌ హీరో అని, ఎన్టీఆర్‌ది సపోర్టింగ్‌ రోల్‌ అని అన్నారు. పలు అవార్డు నామినేషన్లలోనూ సపోర్టింగ్‌ రోల్‌ కోసం ఎన్టీఆర్‌ నామినేట్‌ అయ్యారు. ఇవన్నీ ఆయన పాత్ర తక్కువ అని చెప్పాయి. ఫ్యాన్స్ చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 


ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడారు. ఇందులో `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రస్తావన వచ్చింది. అందులోనూ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ పాత్రలు, కథ గురించి చర్చ జరిగింది. ఎన్టీఆర్‌ పాత్రని సైడ్‌ రోల్‌ అనేది చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆ పాత్రల గురించి రాజమౌళి మాట్లాడారు. ఎన్టీఆర్‌కి పాజిటివ్ గా ఆయన వ్యాఖ్యలున్నాయి. `ఒకవేళ కొమురంభీముడో పాటతోనే సినిమా ఎండ్‌ అయితే, అప్పుడు రామ్‌ చరణ్‌ ది సైడ్‌రోల్‌ అవుతుంది` అన్నారు. 

ఈ వీడియో క్లిప్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. రామ్‌చరణ్‌ ది సైడ్ రోల్‌ అనే వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీన్ని ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ వైరల్‌ చేస్తున్నారు. రామ్‌చరణ్‌ పాత్ర సైడ్‌ రోల్‌ అవుతుందని, అదే జరిగితే, హీరో ఎన్టీఆర్‌ అవుతాడు. ఇది వారిని హ్యాపీ చేసే అంశం. కానీ ఇది చరణ్‌ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టేలా మారింది. రాజమౌళి దానికి సంబంధించి వచ్చిన సందర్భంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ క్లిప్‌ మాత్రమే వైరల్‌ కావడం ఇప్పుడు రచ్చ చేస్తుంది. రామ్‌చరణ్‌పై రాజమౌళి అంత మాట అనేశాడేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్ అవుతుంది. 
 

RRR

ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌ వరకు వెళ్లింది. `నాటు నాటు` సాంగ్‌.. ఓరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌కి ఎంపికైంది. ఏకంగా అవార్డు సాధించింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణి, చంద్రబోస్‌ ఈ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇలా సాంగ్‌ విభాగంలో ఇండియాకి ఆస్కార్‌ రావడం ఇదే తొలిసారి. అదే సమయంలో ఇండియన్‌ సినిమాకి ఆస్కార్‌ రావడం కూడా ఇదే తొలి సారి, అలా `ఆర్‌ఆర్‌ఆర్‌` మూవీ రికార్డు క్రియేట్‌ చేస్తుంది.

Mahesh,rajamouli

ప్రస్తుతం రాజమౌళి.. మహేష్‌ బాబుతో చేయాల్సిన సినిమాపై ఫోకస్‌ పెట్టారు. స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందట. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీన్ని అంతర్జాతీయ స్టాండర్డ్స్ లో ఇంటర్నేషనల్‌ మూవీగా తెరకెక్కించబోతున్నారు జక్కన్న. మహేష్‌ సైతం ఇటీవల `గుంటూరు కారం` రిలీజ్‌ కావడంతో ఫ్రీ అయ్యారు. ఇప్పుడు రాజమౌళి మూవీపై ఫోకస్‌ పెట్టారు. బాడీ ట్రాన్ఫమేషన్‌ అవుతున్నారు. 

Latest Videos

click me!