నితిన్ ‘చెక్’ రివ్యూ

First Published | Feb 26, 2021, 1:17 PM IST

కొత్త తరహా కథలుకు తెలుగులో రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోందని రీసెంట్ గా వచ్చిన ఉప్పెన, నాంది ప్రూవ్ చేసాయి. దాంతో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలుస్తూ వస్తున్న యేలేటి చంద్ర శేఖర్ కొత్త సినిమా అంటే ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది. అందులోనూ కమర్షియల్ సినిమాలు చేసే నితన్ తొలిసారిగా యేలేటి దర్శకత్వంలో చేయటం మరో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా టెర్రరిస్ట్ గా ముద్రపడి జైల్లో ఉన్న ఖైధీకు,చెస్ కు ముడి పెడుతూ కథ చెప్పారనే విషయం వీటిన్నటికన్నా థియోటర్స్ కు సినీ ప్రేమికులను రప్పించే యుఎస్ పి. అయితే అంత ఉత్సాహంగా సినిమాకు వెళ్లిన జనాలకు ఈ సినిమా నచ్చిందా, కథేంటి, యేలేటి ఈ సారి తన మ్యాజిక్ ని రిపీట్ చేసారా, ఎవరు ఎవరికి చెక్ చెప్తారు వంటి విషయాలు కోసం రివ్యూ లోకి వెళ్దాం.

కథ :టెర్రరిస్ట్ లకు సహాయపడ్డాడు అన్న కారణంతో దేశద్రోహి నేరంలో ఆదిత్య (నితిన్) కి జీవిత ఖైదు పడుతుంది. తను చేయని నేరానికి తను ఎలా బలయ్యాడో అర్దం కాదు ఆదిత్యకు. జైలులో తోటి ఖైదీల మధ్య తనది కాని ప్రపంచంలో ఉంటున్న అతనికి అక్కడ చెస్ ఒంటిరిగా తనలో తానే ఆడుకునే ఓ ముసలాయన(సాయిచంద్) పరిచయం అవుతాడు. ఆ పరిచయం అతన్ని చెస్ ప్రపంచంలోకి లాగుతుంది. చెస్ లో మాస్టర్ అవుతాడు. అయితే జైల్లో ఉండేవాడు చెస్ లో మాస్టర్ అయితే ఏమిటి..మరొకటి అయితే ఏమిటి..అతనికి కావాల్సింది స్వేచ్చ. కానీ అతన్ని ఆ కేసునుంచి బయిటపడేయటం మాట దేవుడెరగు..అసలు వాదించటానికి కూడా ఎవరూ ముందుకు రారు.
ఆ సమయంలో మానస (రకుల్ ప్రీత్ సింగ్) అనే జూ.లాయిర్ కి సలహాపై కేసు ఓడినా,గెలిచినా కాస్త మీడియాకు ఎక్కి ఐడింటిటీ వస్తుందని తండ్రి (పోసాని) సలహా ఇచ్చి ముందుకు తోస్తాడు. దాంతో ఆమె ఆదిత్య కేసు టేక్ అప్ చేస్తుంది కానీ, ఆమెకు పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ మానస వచ్చాక ,ఆదిత్యకు లైఫ్ పై ఆసక్తి కలిగుతుంది. దాంతో పట్టుబట్టి ఆదిత్య తన గతాన్ని మానసకు చెప్తాడు.

ఆ గతంలో ఆదిత్య కి యాత్ర (ప్రియా ప్రకాష్) కి మధ్య నడిచిన ప్రేమ కథ ఉంటుంది. అలాగే ఆ ప్రేమ కథకు చెందిన ఓ ట్విస్ట్ ఉంటుంది. ఆమె వల్లే ఆ కేసులో ఇరుక్కుని ఉంటాడు. అయితే ఇప్పుడు యాత్ర ఏమైందో తెలియదు. ఆమె వస్తే కానీ ఆ కేసు తెమలదు. ఇవన్ని తెలుసుకున్న మానస ఏం చేసింది. ఆదిత్య కు చెస్ ఆట జైలు నుంచి బయిటపడేందుకు ఎలా తోర్పడింది.. కామన్వెల్త్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ వరకు ఎలా జర్నీ చేసి,గ్రాండ్ మాస్టర్ టైటిల్ ని గెలుస్తాడు. అసలు యాత్ర వలన అతను ఎందుకు ఇరుక్కున్నాడు. అసలు ఆమె ఎవరు..తనపై పడ్డ టెర్రరిస్ట్ అనే ముద్రను ఎలా తొలిగించుకున్నాడు , కథలో నరసింహరెడ్డి (సంపత్ రాజ్) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్...యేలేటి గత సినిమాలు ముఖ్యంగా ఐతే,అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం ఇలాంటి థ్రిల్లర్స్ చూసిన వారికు ఈ సినిమా ఎక్కటానికి కాస్త బెట్టు చేస్తుంది. ఇప్పటికీ అలాగే తీయాలని కాదు. అప్పట్లోనే అంత టైట్ గా ఉండే స్క్రీన్ ప్లే తో సినిమా తీసాడే..ఇప్పుడేంటి ఇంత సెకండాఫ్ లో లాగ్ లతో తీసాడనిపిస్తుంది. అలాగే ఒక్కడున్నాడు, సాహసం వంటి చిత్రాల్లో ఆయన తీసుకున్న నేపధ్యం మనకు ఆశ్చర్యపరుస్తుంది. అలాగే ఈ సినిమాలోనూ ఇప్పటికీ తెలుగు తెరపై రాని నేపధ్యం తీసుకున్నారు. అందులో సందేహం లేదు.
ఒక్కడున్నాడులాగే ఇది కూడా క్యారక్టర్ డ్రైవన్ ప్లాటే. అయితే అన్ని బాగానే ఉన్నా కథలో ఉండాల్సిన కాంప్లిక్ట్ మాత్రం వీక్ గా అనిపిస్తుంది. ఓ వ్యక్తి తను చేయని తప్పుకి జైల్లో జీవితాంతం ఉండాల్సి రావటం అనేది పెయినే,మంచి కాప్లింక్టే కానీ అందుకు దారి తీసిన పరిస్దితులు, అతను వాటిని ఎదుర్కొనే తీరు ఆ కాంప్లిక్ట్స్ ని వీక్ గా మార్చేసేంది. హీరో తెలివైన వాడుగా చూపటానికి అతన్ని వైట్ కాలర్ క్రైమ్ లు చేసుకునే అతనులా చూపించారు. దాంతో అతనిపై సానుభూతి కరువు అవుతుంది. కథ నడుస్తూంటుంది కానీ హీరో పాత్రపై ప్రత్యేకమైన అభిమానం ఏర్పడదు. మోసం చేసే వ్యక్తి వేరే కారణంతో అయితేనేంటి జైలు పాలయ్యాడు కదా అనిపిస్తుంది.
అంతెందుకు మనకు పాతదే ఉదాహరణ అయినా అభిలాషలో చిరంజీవికు ఉరి తీసేస్తారు అనగానే ఎలాగైనా అతను బయిటపడాలని కోరుకునేలా సీన్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అతను అమాయికంగా ఇరుక్కున్న తీరు,అదీ ఓ మంచి పనికోసం ఇరుక్కోవటం, విలన్ తెలివి ఉపయోగించి ఇరికించటం వంటివి మనకు ఆ పాత్రపై సానుభూతి తీసుకొచ్చి కాంప్లిక్ట్స్ ని బలంగా మార్చేస్తాయి. మనకు తెలుసున్న ఓ వ్యక్తి పాపం మనకోసం పోరాడి ఇరుక్కుపోయేడే అనిపిస్తుంది. ఇక్కడ ఆ సానుభూతి కానీ సహాయానుభూతి కానీ హీరోపై మనకు రాదు .
ఇక ప్రీ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేదాకా సెటప్ తో నడుస్తుంది. హీరో తనకు పడ్డ శిక్ష నుంచి బయిటపడటానికి వేసే ఎత్తుగడ ప్రీ ఇంటర్వెల్ నుంచి మొదలై ఇంట్రస్ట్ రైజ్ అవుతుంది. అయితే ఆ తర్వాత ఆ స్దాయిలో ఆ ఇంట్రస్ట్ మెయింటైన్ చేయలేకపోయారు. అన్నిటికన్నా ముఖ్యంగా చెస్ అనేది తెలుసున్న వాళ్లు ఎంజాయ్ చేసినట్లు గా సెకండాఫ్ ని మిగతావాళ్లు చేయలేదని నిజం. దానికి తోడు కాంప్లిక్ట్స్ బలంగా లేకపోవటంతో డ్రామా రెడీ కాలేదు.
చెస్ ద్వారా హీరో గాబట్టి ఖచ్చితంగా ఈ జైలు నుంచి బయిటపడిపోతాడని ఫిక్సై పోతాం. దానికి తోడు అతని చెస్ తో బయిటపడటానికి చేసే ప్రయత్నాలకి అడ్డం ఎవరూ లేరు. అక్కడే గ్రిప్ కోల్పోయారు. మనకు అప్పుడు హీరో మాస్టర్ అయితే ఏమిటి గ్రాండ్ మాస్టర్ అయితే ఏమిటి ..అసలు అనిపిస్తుంది. మైండ్ తో చేసే పనులకు సంభందించిన సీన్స్ కు తెరపై విజువల్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. దానికి తోడు జైల్లో ఎక్కువ సేపు నడవటం మరో ఇబ్బంది. అయితే క్లైమాక్స్ బాగుంది. అక్కడ యేలేటి తన మార్క్ ని చూపించారు.
ప్లస్ లు..నితిన్ రెగ్యులర్ నటనకు బిన్నంగా క్యారక్టర్ కు తగినట్లు బిహేవ్ చేయటంరొటీన్ స్టోరీ లైన్ కాకపోవటంసాయి చంద్ క్యారెక్టరైజేషన్కళ్యాణి మాలిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ఫిలాసపితో కొత్త డైమన్షన్ తో సాగే డైలాగులుకెమెరా వర్క్లాజిక్ తో ఆర్ట్ ఫామ్ లో సాగే డైరక్షన్
మైనస్ లుచాలా మందికి అర్దంకాని చెస్ గేమ్ ని హైలెట్ చేస్తూ సీన్స్ నడపటంజైల్లో ఎక్కువ సీన్స్ఎక్కడా రిలీఫ్ అనేది లేకపోవటంసెకండాఫ్ స్లోగా ఉండటంనితిన్ నుంచి ఆశించే ఏమీ లేకపోవటం
టెక్నికల్ గా ...సినిమాలో ఒకే సాంగ్ ఉంది. అదీ నీట్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక రాహుల్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. డైలాగులు కొత్తగా అనిపించాయి. ఎక్కడా అతి గా, అతికినట్లుగానూ అనిపించలేదు. చెస్ సీక్వెన్స్ లను మరింత ఎడిట్ చేయచ్చు. కాకపోతే డైరక్టర్ దగ్గరుండి ఉంచమంటే ఎడిటర్ చేసేదేముంటుంది. ఆర్ట్ డిపార్టమెంట్ కూడా ఈ సినిమాలో తన ప్రత్యేకతను చూపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ థాట్రొటీన్ కథలకి ‘చెక్’ పెట్టే ప్రయత్నంలో, కమర్షిల్ ఎలిమెంట్స్ కు ‘చెక్’ చెప్పుకున్నారు---సూర్య ప్రకాష్ జోశ్యులRating:2.5
ఎవరెవరు..బ్యానర్: భవ్య క్రియేషన్స్నటీనటులు: నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణ మురళీ, మురళీ శర్మ తదితరులు మ్యూజిక్: కల్యాణి మాలిక్సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీవాస్తవ్ఎడిటింగ్: సనల్ అనిరుధన్నిర్మాత: వీ ఆనంద ప్రసాద్రచన, దర్శకత్వం: చంద్రశేఖర్ ఏలేటిరిలీజ్: 2021-06-26

Latest Videos

click me!