ఇద్దరు క్రేజీ యంగ్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఆ ఇద్దరు హీరోలు నితిన్, నాగ చైతన్య. వృషకర్మ, అలియాస్ రుక్మిణి సినిమాలపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
డిసెంబర్ 4న టాలీవుడ్ లో రసవత్తరమైన బాక్సాఫీస్ పోటీ ఉండబోతోంది. ఇద్దరు క్రేజీ యంగ్ హీరోల సినిమాలు ఒకే రోజులు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి నాగ చైతన్య నటించిన వృషకర్మ కాగా మరొకటి నితిన్ నటించిన అలియాస్ రుక్మిణి. ఈ రెండు చిత్రాలు ఒకదానికొకటి సంబంధం లేని జోనర్స్ కి చెందినవి అయినప్పటికీ రెండూ క్రేజీ ప్రాజెక్టులే.
25
మిస్టీరియస్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ
నాగ చైతన్య వృషకర్మ చిత్రం మిస్టీరియస్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోంది. విరూపాక్ష చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. తండేల్ లాంటి హిట్ తర్వాత నాగ చైతన్య నుంచి వస్తున్న మూవీ ఇదే. ఈ సినిమా కనుక హిట్ అయితే చైతు నెక్స్ట్ లెవల్ కి వెళ్లడం ఖాయం అంటూ అంచనాలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ చిత్రంపై మంచి బజ్ ఉంది.
35
ఎమోషనల్ డ్రామా
మరోవైపు నితిన్ నటించిన అలియాస్ రుక్మిణి చిత్రాన్ని నాని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా డీసెంట్ బజ్ ఉంది. ఇది ఎక్కువగా ఫ్యామిలీ, యూత్ అప్పీల్ ఉన్న సినిమా. ప్రస్తుతం నితిన్ కెరీర్ కి ఒక హిట్టు అవసరం. అలియాస్ రుక్మిణి చిత్రంతో హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. రెండు సినిమాలకు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
అటు నితిన్, ఇటు నాగ చైతన్య తమ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గతంలో నితిన్ కి మంచి మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపుల తర్వాత అది డ్యామేజ్ అయింది. నాగ చైతన్య అయితే వైవిధ్యమైన కథలు చేస్తూ తన కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ వెళుతున్నాడు.
55
హీరోయిన్లు వీళ్ళే
మొత్తంగా డిసెంబర్ 4న ఏ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ఆడియన్స్ ఇచ్చే రెస్పాన్స్ పై ఆధారపడి ఉంటుంది. రెండు చిత్రాలకు మంచి టాక్ వస్తే కలెక్షన్స్ కి ఎలాంటి డోకా ఉండదు. వృషకర్మ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోగా నటించగా.. అలియాస్ రుక్మిణిలో ఆఫియా సయ్యద్ నటించారు.