ఆటో దానివి ఎక్కువ చేస్తున్నావ్ అంటే.. నేను డాక్టర్ కార్తీక్, దీప కూతురుని, సౌందర్య, ఆనంద్ రావుల మనవరాలిని.. ఆతర్వాతే ఆటో డ్రైవర్ ని అని చెప్తుంది. ఇక అక్కడకు వచ్చిన సౌందర్య, ఆనంద్ రావులు కూడా శౌర్యకు సపోర్ట్ చెయ్యడంతో స్వప్న అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం అంత హిమకు చెప్తూ సౌందర్య ఇద్దరు ఆనంద పడుతుంటారు. శౌర్య చాలా ట్యాలెంట్ అని హిమ అంటుంది. ఇక అక్కడకు వచ్చిన శౌర్య మళ్లీ హిమను బాధపెడుతోంది.