Naga Chaitanya: సమంతతో ఫ్యూచర్ లో నటిస్తారా ? ఓపెన్ అయిన నాగ చైతన్య, అదిరిపోయే సమాధానం

Published : Aug 01, 2022, 08:44 AM IST

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'.  చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం నాగ చైతన్య ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. 

PREV
16
Naga Chaitanya: సమంతతో ఫ్యూచర్ లో నటిస్తారా ? ఓపెన్ అయిన నాగ చైతన్య, అదిరిపోయే సమాధానం

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చడ్డా'.  చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం నాగ చైతన్య ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ స్నేహితుడు బాలరాజు పాత్రలో చైతు ఈ చిత్రంలో నటిస్తున్నాడు. 

 

26

తాజాగా ఇంటర్వ్యూలో చైతు మాట్లాడుతూ లాల్ సింగ్ చడ్డా చిత్రంలో తన పాత్ర ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుందని తెలిపాడు. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.. సౌత్ సినిమాల ప్రభావం ఇలా అనేక విషయాల గురించి చైతు తెలిపాడు. సుమంత్, రానా, అఖిల్ వీళ్లంతా నా ఫ్యామిలీ. సినిమాల్లో నన్ను విమర్శించడం, అభినందించడం చేస్తుంటారు. 

 

36

ఇంకా నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. క్లోజ్ ఫ్రెండ్స్ ఐదారుగురు మాత్రమే ఉంటారు. ఎక్కువమంది ఫ్రెండ్స్ తో తిరగడం లాంటివి నేను చేయను అని చైతు తెలిపాడు. సౌత్ సినిమాల గురించి మాట్లాడుతూ.. సౌత్ చిత్రాలు నార్త్ లో కూడా విడుదలై ప్రభావం చూపడం మంచి పరిణామం. ఏ చిత్ర పరిశ్రమ నుంచి మంచి చిత్రం వచ్చినా అది ఇండియన్ సినిమాగానే భావించాలి అని చైతు అన్నాడు. 

 

46

తన గురించి వస్తున్న రూమర్స్ పట్టించుకోను అని చైతు క్లారిటీ ఇచ్చాడు. మొదట్లో ఆలోచించేవాడిని అని ఇప్పుడు ఆ రూమర్స్ గురించి అంతగా ఆలోచించడం లేదు అని చైతు తెలిపాడు. ఇక ఇంటర్వ్యూలో యాంకర్ సమంత గురించి ఆసక్తికర ప్రశ్న సంధించాడు. ఆన్ స్క్రీన్ పై సమంతతో మీ కెమిస్ట్రీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా అని అడిగాడు. చైతు అవునని బదులిచ్చాడు.  

 

56

త్వరలో సమంతతో కలసి నటించే అవకాశం ఉందా అని ప్రశ్నించగా చైతు గట్టిగా నవ్వేశాడు. ఒకవేళ అలా జరిగితే చాలా క్రేజీగా ఉంటుందేమో.. కానీ అది జరుగుతుందో లేదో నాకు తెలియదు.. ఈ ప్రపంచానికే తెలియాలి అంటూ నాగ చైతన్య సమాధానం ఇచ్చాడు. 

 

66

నాగ చైతన్యకి రీసెంట్ గా థాంక్యూ రూపంలో గట్టి షాకే తగిలింది. ఊహించని విధంగా థాంక్యూ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. బంగార్రాజు చిత్రంతో ఈ ఏడాదిని చైతు ఘనంగా ప్రారంభించాడు. కానీ ఆ విజయాన్ని థాంక్యూ కొనసాగించలేకపోయింది. ఇప్పుడు చైతు ఫ్యాన్స్ లాల్ సింగ్ చడ్డా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories