ఈరోజు ఎపిసోడ్ లో సౌర్య(sourya)దగ్గరికి వెళ్లిన హిమ నన్ను చంపి నా మీద కోపం ఉంటే కొట్టు అని అనగా వెంటనే సౌర్య చంపేయడాలు నీలాగా నాకు అలవాటు లేదు అని అంటుంది. మనుషుల ప్రాణాలను అవలీలగా తీయడం నీకు మాత్రమే తెలుసు నాకు తెలియదు అనడంతో ఆ మాటలు వింటున్న సౌందర్య,ఆనందరావు(anand rao) బాధపడుతూ ఉంటారు. అప్పుడు సూర్య నా దగ్గర క్షమించే అంత మానవత్వం లేదు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది సౌర్య. మరొకవైపు ప్రేమ్,స్వప్న అన్న మాటల గురించి తెలుసుకొని ఆలోచిస్తూ ఉంటారు.