Karthika Deepam: శోభాకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన జ్వాల.. స్వప్న ఆశీర్వదాలు తీసుకున్న సౌర్య!

Published : May 24, 2022, 07:37 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో సాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు మే 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Karthika Deepam: శోభాకు అదిరిపోయే రిప్లై ఇచ్చిన జ్వాల.. స్వప్న ఆశీర్వదాలు తీసుకున్న సౌర్య!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే స్వప్న (Swapna) హిమను నిరూపమ్ (Nirupam) ఎక్కడ అని అడుగుతుంది. జ్వాల లతో కలిసి ఆటోలో బయటికి వెళ్లాడు అని చెబుతుంది. దాంతో వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. స్వప్న నిరూపమ్ కి ఫోన్ చేయగా ఫోన్ కట్ చేస్తాడు.
 

26

ఇక మరోవైపు జ్వాల (Jwala) నిరూపమ్ ను ఒక అనాధ ఆశ్రమానికి తీసుకొని వస్తుంది. ఇక జీవితంలో ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా ఉండాలని జ్వాల నిరూపమ్ కు చెబుతుంది. దాంతో నిరూపమ్ (Nirupam) నువ్వు నా మనసులో టెన్షన్ ఫ్రీ చేసావ్ థాంక్యూ రౌడీ బేబీ అని అంటాడు.
 

36

అంతేకాకుండా నిరుపమ్ (Nirupam) హిమ విషయంలో నీ హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటాను కానీ ఇప్పుడు కాదు అని మనసులో అనుకున్నాడు. మరోవైపు సప్న (Swapna) డాక్టర్ శోభా దేవి నాకు కాబోయే పెద్ద కోడలు అని హిమ కు చెబుతుంది. ఆ మాటతో హిమ ఒక్కసారి గా స్టన్ అవుతుంది.
 

46

ఇక శోభా (Shobha) అనాధ ఆశ్రమానికి వెళుతుంది. అక్కడ ఉన్న నిరూపమ్ (Nirupam) హలో శోభా అంటూ కౌగిలించుకుంటాడు. నిరూపమ్ ఒకరికి ఒకరని పరిచయం చేస్తాడు. శోభా నేను స్వప్న ఆంటీ తో కలిసి వచ్చాను అని అంటాడు. ఇక నువ్వు ఫోన్ కాల్ ఆన్సర్ చేయడం లేదని నీ పైన కోపంగా ఉంది అని చెబుతుంది.
 

56

ఇక శోభా (Shobha) ఇప్పుడు అర్థమైందా నా రేంజ్ ఏమిటో అని అంటుంది. అంతేకాకుండా నన్ను కొట్టి నందుకు ఫీల్ అవుతున్నావా? అని జ్వాల (Jwala) తో అంటుంది. దాంతో జ్వాల ఇంకా రెండు ఎందుకు పీక లేదని ఫీల్ అవుతున్నాను అని అంటుంది. ఇక శోభా స్వప్న తో ఎలాగైనా ఆటోని ఆటో గ్యారేజ్ కు పంపుతాను అని అంటుంది. నిరూపమ్ నేను వెళ్లకపోతే శోభా ఫీల్ అవుతుంది. నేను ఇంటికి వెళతాను అని జ్వాల కు చెప్పి వెళతాడు.
 

66

ఇక తరువాయి భాగంలో జ్వాల (Jwala) ఏకంగా స్వప్న ఇంటికి భోజనం తీసుకొని వెళుతుంది. స్వప్న (Swapna) జ్వాల ను కసురుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో జ్వాల స్వప్న దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక రేపటి భాగం లో  ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

click me!

Recommended Stories