అక్కినేని నాగేశ్వరరావు జన్మించి వందేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అక్కినేని ఫ్యామిలీ, అభిమానులు. ఆయన ఫోటోతో ఏకంగా భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంప్‌ని కూడా విడుదల చేసింది. దీన్ని ఈ రోజే ఆవిష్కరించారు. అలాగే మూడు రోజులపాటు ఏఎన్నార్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. ఆయన బెస్ట్ మూవీస్‌ని ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. `దేవదాసు`, `ప్రేమాభిషేకం` వంటి బెస్ట్ క్లాసిక్స్ ఇందులో ఉన్నాయి.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్, ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
Chiranjeevi
శతజయంతిని పురస్కరించుకుని శుక్రవారం అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి అక్కినేని పురస్కారాన్ని ప్రకటించారు. ఈ సారి మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారం అందించనున్నట్టు తెలిపారు. అక్టోబర్ 28న ఈ ఈవెంట్ ఉంటుందన్నారు. అభితాబ్ బచ్చన్ గెస్ట్ గా రాబోతున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉంటే ఏఎన్నార్ శతజయంతి వేళ అక్కినేనికి చెందిన అరుదైన విషయాలు,ఇప్పటి వరకు బయటకు రాని విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అందులో భాగంగా ఏఎన్నార్ సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశాడు? ఎలా వచ్చాడు, ప్రారంభంలో ఆయన ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది ఆసక్తికరంగా మారింది.
ఓ ఇంటర్వ్యూలో ఏఎన్నార్ ఈ విషయాలను వెల్లడించారు. అక్కినేనికి నాటకాలంటే ఇష్టం. చిన్నప్పుడు అనేక నాటకాలు వేశారు. ముఖ్యంగా లేడీ పాత్రలతో అలరించారు. బెజవాడ రైల్వే స్టేషన్ వద్ద నాటకాలు వేస్తుంటే ప్రముఖ దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య అక్కినేని చూసి సినిమాల్లోకి వస్తావా అడిగాడు. ఏఎన్నార్ ఆసక్తి చూపించడంతో తనతోపాటు మద్రాస్ తీసుకెళ్లారు.
మద్రాస్ వెళ్లాక అక్కడ సినిమాల్లో చేసే ఉద్యోగం ఇచ్చాడు. సినిమా ప్రొడక్షన్ చూసుకుంటూ, వర్క్ నేర్చుకోవడానికి పనిలో పెట్టుకున్నారు. అందుకు అక్కినేనికి బాలరామయ్య.. ఓ రూమ్ ఇచ్చి, భోజనం కూడా పెట్టారు. అంతేకాదు నెలకు 250 రూపాయలు కూడా ఇచ్చారట. వాటినే దాచుకుని, తన బట్టలకు, ఫుడ్‌కి ఉపయోగించేవాడట.
అయితే నెలకి బయటి ఫుడ్ కోసం యాభై రూపాయలు ఖర్చు చేసేవాడట. పాండిబజార్‌లో టిఫిన్ బాగుంటుందని, ఓ హోటల్‌కి వెళ్లేవాడని, ఒక్కడ ఒక ప్లేట్ ఇడ్లీ తిని రెండుసార్లు సాంబార్ తాగేవాడట. దీంతో ఏఎన్నార్ ని ఆ హోటల్ వాడు గమనించి వీడు పెద్ద సాంబార్ బ్యాచ్ అంటూ తిట్టేవాడట. అవేమీ పట్టించుకోకుండా సాంబార్‌ని లాగించేవాడట ఏఎన్నార్.
అలా సినిమాల్లోకి వచ్చాక ఏఎన్నార్ అందుకున్న మొదటి జీతం 250 రూపాయలు. ఇక అంతకు ముందు నాటకాల్లో మొదటగా ఆయనకు 50పైసలు ఇచ్చేవాళ్లట. ఊరూర నాటకాలు ప్రదర్శించేటప్పుడు ఆయనకు మొదట్లో వచ్చేది యాభై పైసలే అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు అక్కినేని. అలాగే నాటకాలు మానేసే నాటికి ఒక్కో నాటకానికి ఐదు రూపాయలు ఇచ్చేవారని తెలిపారు.
తమది పేద వ్యవసాయం కుటుంబం. చదువుకోవడానికి డబ్బులు లేవు, దీంతో స్కూల్ టైమ్‌లోనే చదువు మానేసి నాటకాలు వేయడం ప్రారంభించాడట అక్కినేని. అదే ఆయన్ని పెద్ద స్టార్ అవడానికి పునాది వేసింది.
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ లెజెండ్‌ని తయారు చేసింది. అద్భుతమైన నటుడిగా తెలుగు ఆడియెన్స్ కి ఇచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లుగా తెలుగు ప్రజలు, ఇండస్ట్రీ కొనియాడుతున్న విషయం తెలిసిందే.
అక్కినేని నాగేశ్వరరావు 1924 సెప్టెంబర్ 20న జన్మించిన విషయం తెలిసిందే. ఆయన జన్మించి వందేళ్లు అయిన కారణంగా శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఏఎన్నార్ క్యాన్సర్‌తో పోరాడి 2014 జనవరిలో కన్నుమూశారు. నాటకాలతో నటన కెరీర్ ని ప్రారంభించిన ఆయన మద్రాస్‌కి వెళ్లాక బలరామయ్యగారి సహకారంతో మొదట్లో `ధర్మపత్ని` చిత్రంలో చిన్న పాత్రలో మెరిశారు.
ఆ తర్వాత `సీతారామ జననం` చిత్రంతో హీరోగా మారారు. దాదాపు ఏడు దశాబ్దాలపాటు నటుడిగా కొనసాగారు. 259 సినిమాలు చేశారు. చివరగా ఆయన `మనం` చిత్రంలో నటించారు. ఇందులో అక్కినేని మూడు తరాల నటులు నటించారు. ఏఎన్నార్‌తోపాటు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కూడా కలిసి నటించడం విశేషం. ఈ మూవీ రిలీజ్‌కి ముందే ఆయన కన్నుమూశారు. ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. క్లాసిక్‌గా నిలిచింది.