ఐశ్వర్య రాయ్ వల్ల ఓ సందర్భంలో తనకు రెండు రోజులు నిద్ర లేని రాత్రులు గడిపాన్నారు బిగ్ బీ. ఎందువల్ల అంటే. 2003లో ఐశ్వర్య నటించిన 'ఖాకీ' సినిమా షూటింగ్ మహారాష్ట్రలోని నాసిక్‌లో జరుగుతుండగా.. ఒక ప్రమాదం జరిగింది. ఒక స్టంట్‌మ్యాన్ వేగంగా వచ్చి ఐశ్వర్య కూర్చున్న కారును బలంగా ఢీకొట్టాడు.
ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా సంపూర్ణేష్ బాబు
ఈ హఠాత్పరిణామంతో ఐశ్వర్యరాయ్ కారులో చిక్కుకుపోయింది. అయితే వెంటనే తేరుకున్న హీరో అక్షయ్ కుమార్ కారును ఆపి ఐశ్వర్యను కాపాడి వెంటనే హాస్పిటల్ కు తరలించారు.
అంతే కాదు అమితాబ్ ఐశ్వర్య తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని వివరించడంతో పాటు..అప్పుడు అతిపెద్ద బిజినెస్ మెన్ అయిన అనీల్ అంబానీ ప్రైవేట్ జెట్ ద్వారా ఆమెను ముంబైకి తరలిస్తామని చెప్పారు.
దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో అంత హింస అనుభవించిందా..?
సరిగ్గా అదే సమయంలో నాసిక్‌లో రాత్రిపూట విమానం దిగేందుకు సదుపాయం లేకపోవడంతో, ఢిల్లీ నుండి ఆసుపత్రికి 45 నిమిషాల దూరంలో ఉన్నందున.. సైనిక స్థావరంలో దిగడానికి అనుమతి అడగడం.. వెంటనే అది లభించడం జరిగింది.
అంతే కాదు ఐశ్వర్యరాయ్ ను ఆ జెట్ లో తీసుకెల్ళడానికి వీలు లేకపోవడంతో.. "విమానంలో సీట్లను తొలగించాల్సి వచ్చింది. అయితే ఈ విషయంలో ఎవరు అడ్డు చెప్పలేదు. విమానంలో సీట్లను తొలగించడం కూడా చాలా చిన్న విషయంగా భావించారని" అమితాబ్ అన్నారు.
ప్రభాస్ ఫౌజీ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
ఇక అప్పుడు ఐశ్వర్య పరిస్థితిని చూసి, నా కళ్ల ముందే ఇలా జరగడం చూసిన తర్వాత, రెండు రాత్రులు నాకు నిద్ర పట్టలేదని అమితాబ్ అన్నారు. ఆమె వీపుకు ముళ్ళు గుచ్చుకున్నాయి. కాళ్ల ఎముకలు విరిగిపోయాయి. శరీరంలో చాలా చోట్ల కోతలు ఉన్నాయి. అవి చూసి నేను తట్టుకోలేకపోయాను అన్నారు. .
ఈ సంఘటన జరిగినప్పుడు ఐశ్వర్య బచ్చన్ కుటుంబంలో కోడలు కాదు. మూడు సంవత్సరాల తర్వాత, ఏప్రిల్ 20, 2007న ఐశ్వర్య, అభిషేక్‌ల వివాహం జరిగింది. ఐశ్వర్య, అభిషేక్‌లు ప్రస్తుతం విడాకుల వార్తలతో వార్తల్లో ఉన్నారు. ఇద్దరూ విడిగా జీవిస్తున్నారని సమాచారం.