‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’దారుణం: ఎంత పెట్టారు, ఎంత పోతోంది?

First Published | Nov 10, 2024, 11:54 AM IST

హ్యాట్రిక్‌ మూవీ అంటే మంచి హైప్‌ ఉంటుంది. కానీ ఈ చిత్రం వస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు. చిత్ర టీమ్  కూడా ఎలాంటి ప్రమోషన్స్‌ లేకుండా సినిమాను రిలీజ్‌ చేశారు. 

Nikhil, Appudo ippudo Epuudo, movie review


కొన్ని కాంబినేషన్స్ రిపీట్ అయ్యినప్పుడు చెప్పుకోదగ్గ ఓపినింగ్స్, కలెక్షన్స్ వస్తూంటాయి. అయితే చిత్రంగా నిఖిల్‌ సీనీ కెరీర్‌లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘స్వామిరారా’ ఒక్కటి. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కేశవ’ కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది.

వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రమే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. హ్యాట్రిక్‌ మూవీ అంటే మంచి హైప్‌ ఉంటుంది. కానీ ఈ చిత్రం వస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలియలేదు. చిత్ర టీమ్  కూడా ఎలాంటి ప్రమోషన్స్‌ లేకుండా సినిమాను రిలీజ్‌ చేశారు. చడీ చప్పుడు లేకుండా నేడు(నవంబర్‌ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చినీ చిత్రం  కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Nikhil, Appudo ippudo Epuudo, movie review


రిలీజ్ అయిన రోజు నుంచి ఈ సినిమాకు కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. రిలీజ్ రోజు కేవలం 35 లక్షలు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెచ్చుకుంది. ఆ తర్వాత నుంచి ఆ స్దాయి కలెక్షన్స్ కూడా లేదు.

డిజాస్టర్ ఫిల్మ్ గా ఈ సినిమా నమోదు అయ్యింది.  కొన్ని థియేటర్స్ లో అయితే ఎనిమిది నుంచి పది మంది మించి ప్రేక్షకులు కనపడటం లేదు. చాలా చోట్ల షోలు కాన్సిల్ చేసారు. చాలా వరస్ట్ సిట్యువేషన్ గా డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. 


Nikhil, Appudo ippudo Epuudo, movie review


వాస్తవానికి   ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాలో చెప్పుకోవడానికి కొత్త విషయం ఒక్కటైనా ఉందా అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఆసక్తి గొలిపే సంఘటన కానీ, మలుపు తిప్పే ట్విస్టులు కానీ, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కానీ లేకుండా దర్శకుడు చాలా ‘జాగ్రత్తగా’కథనాన్ని నడిపించాడు.

రొటీన్‌ లవ్‌స్టోరీకి క్రైమ్‌ థ్రిల్లర్‌ని జోడించి ఓ డిఫరెంట్‌ స్టోరీని చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే అది తెరపై చూస్తే మాత్రం దర్శకుడు కొత్తగా ఏం చెప్పాలనుకునే విషయం మాత్రం అర్థం కాదు. నిఖిల్‌ సినిమా కదా కనీసం కొన్ని సీన్స్‌ అయినా ఆసక్తికరంగా ఉంటాయేమో అని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది.
 

Nikhil, Appudo ippudo Epuudo, movie review


 సినిమా ప్రారంభం అయినా పది నిమిషాలకే ఇది రోటీన్‌ స్టోరీ అని అర్థం అయిపోతుంది. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడు ఈజీగా పసిగట్టగలడు.

ప్రజెంట్‌, ఫ్లాష్‌బ్యాక్‌ అంటూ కథను ముందు , వెనక్కి తిప్పుతూ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారిందే తప్పా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది. చాలా సెంటర్స్ లో మొదటి రోజే మినిమమ్ జనాలు లేక షోలు కాన్సిల్ అయ్యాయి. 

Nikhil, Appudo ippudo Epuudo, movie review


మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేక పోతున్న ఈ సినిమా టాక్ కూడా మిక్సుడ్ టు నెగటివ్ గానే ఉండటంతో తేరుకునే అవకాశం కష్టమే.ఈ సినిమాను సుమారుగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు భారీగానే బిజినెస్ జరిగింది.

దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్ల రూపాయల షేర్, 14 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. కార్తీకేయ 2 తర్వాత నిఖిల్ నటించిన ఈ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ ఎలాంటి క్రేజ్ కనిపించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం కనిపించలేదు.  ఈ సినిమాను సుమారుగా 10 కోట్ల రూపాయలు బడ్జెట్‌తో తెరకెక్కించారు. 
 

Latest Videos

click me!