లైక్స్‌ కోసం, వ్యూస్‌ కోసం తప్పుడు వార్తల స్ప్రెడ్ చేయద్దు: శ్రీలీల, నిఖిల్, చాగంటి వారు

First Published | Jan 2, 2025, 8:26 AM IST

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని, విధ్వేష, విషపూరిత రాతలు వద్దంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. ఈ ప్రచారంలో భాగంగా నలుగురు సినీ నటులు నిఖిల్, శ్రీలీల, అడవి శేష్, తేజ సజ్జా పాల్గొన్నారు.

nikhil, Sreeleela, adivi sheshu


సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దని, విధ్వేష, విషపూరిత రాతలు వద్దంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచారం చేపట్టింది. "సోషల్ మీడియాను మంచికి, పాజిటివ్ అంశాలకు వేదికగా మార్చుదాం" అనే స్లోగన్‌తో  ప్రజలను ఆలోచింపచేసేలా ప్రచారం చేస్తున్నారు.

విజయవాడ- గుంటూరు దారిలో తాడేపల్లి హైవే వద్ద ఈ భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే రాజధాని అమరావతితో పాటు తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో ఫ్లెక్లీలు,హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సినీ నటులతో కూడా ప్రచారం మొదలెట్టారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  చాగంటి కోటేశ్వరరావు గారితో కూడా చెప్పించారు. 
 

hazardous waste


చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడవద్దు అనే గాంధీజీ సూక్తి కాన్సెప్ట్‌తో సోషల్ మీడియాపై క్యాంపెయిన్ చేపట్టారు. త్రీ మంకీస్ బొమ్మకు ఫోర్త్ మంకీ చేర్చి చెడు పోస్టులు వద్దంటూ ఆసక్తికరంగా హోర్డింగులు పెట్టారు. 'పోస్ట్​ నో ఈవిల్' (POST NO EVIL) పేరుతో ఫోర్త్ మంకీ బొమ్మతో జరుగుతున్న ఈ ప్రచారానికి తాజాగా సినీ నటులు, ప్రముఖులు తోడవుతున్నారు.

 సోషల్ మీడియాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్న ప్రచారంలో టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ (Nikhil) భాగమయ్యారు.   ఇప్పటికే సినీ నటులు అడవి శేష్, శ్రీలీల తమ మద్దతు తెలిపుతూ వీడియోలు విడుదల చేశారు.


school Kalolsavam


‘పోస్ట్‌ నో ఈవిల్‌’ గురించి తెలుపుతూ నిఖిల్  ఓ వీడియో విడుదల చేశారు. సోషల్‌ మీడియాను మంచి కోసం ఉపయోగించాలని కోరారు. ‘‘మనం ఏదైనా వస్తువు కొనేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని కొంటాం. కానీ, సోషల్‌ మీడియాలో న్యూస్‌ షేర్‌ చేసే ముందు అది నిజమా..కాదా అని ఎందుకు చెక్‌ చేసుకోవడం లేదు?.

ఎందుకంటే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా తీసుకుంటాం. కానీ, మీరు సరదాగా షేర్‌ చేసే ఆ ఫేక్‌ న్యూస్‌ కొన్ని జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే మీరు ఏదైనా విషయాన్ని పంచుకునే ముందు అది నిజమా.. కాదా అని ఒక్కసారి పరిశీలించండి’’ అని చెప్పారు.


 శ్రీలీల మాట్లాడుతూ... "సోషల్‌ మీడియాలో లైక్స్‌ కోసం, వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకండి. ఇవన్నీ కాదని న్యూస్‌ కోసం ఇంకొకరిని న్యూస్‌ చేయకండి. అసత్య ప్రచారాలకు దూరంగా ఉండండి. సామాజిక బాధ్యత వహిద్దాం." అంటూ శ్రీలీల చెప్పింది.
 


అసత్య ప్రచారాలు చేయవద్దని, ఎవరు చూస్తారులే అని ఇష్టానుసారంగా తప్పుడు కామెంట్స్‌, బూతులతో ఇతరులను దూషించడం చేయవద్దని సూచించారు. మనం ఫేక్‌ న్యూస్ షేర్‌ చేస్తే ఏం అవుతుందిలే అని చేస్తాం కానీ అలాగే చేస్తే దాన్ని చాలా మంది నిజంగా భావించే అవకాశం ఉంది. అందుకే ఫేక్‌ న్యూస్‌ను షేర్‌ చేయవద్దని అడవి శేష్‌ సూచించారు
 


ప్రతి ఒక్కరు సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల మనసులు బాధ పడే విధంగా పోస్టులు పెట్టొద్దు. అందులోనూ ప్రత్యేకంగా కుటుంబసభ్యులు, మహిళల గురించి అసభ్యంగా పోస్టులు పెట్టకుండా ఉండాలి.- చాగంటి కోటేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
 


ఏం కాదులే అని సోషల్ మీడియాలో ఆడపిల్లల పోస్టులకు పెట్టే కామెంట్స్ వాళ్ల మైండ్​సెట్​ని చాలా డిస్టర్బ్ చేస్తాయి. ఏదైనా జరగని విషయాన్ని జరిగిందని చెప్పినా తప్పుడు ప్రచారం చేసినా వాటివల్ల ఎన్నో కుటుంబాలు బాధపడతాయి. ఇకనుంచి సోషల్ మీడియాని మంచి కోసం వాడుకుందాము. తప్పడు పోస్టులు పెట్టకుండా ఉందాము.- తేజ సజ్జా, సినీ నటుడు
 

Latest Videos

click me!