మంచు విష్ణు స్టాఫ్ అడవి పందుల వీడియో వైరల్, వెనుక ఎవరున్నారు?

First Published | Jan 2, 2025, 7:47 AM IST

మంచు విష్ణు సిబ్బంది జల్‌పల్లి అడవిలో అడవి పందులను వేటాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి, అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


కొత్త సంవత్సరం మంచు ఫ్యామిలీ మరో వివాదంతో ముందుకు వచ్చింది. 2024 చివర్లో మంచు కుటుంబంలో వివాదాలు, అన్న‌ద‌మ్ముల గొడ‌వ కాస్తా కోర్టుల వ‌ర‌కు వెళ్లాయి. కుటుంబ గొడవలతో వీధికెక్కిన సినీనటుడు మోహన్‌బాబు ఇంటి వివాదం మరింతగా ముదురింది.

 చిన్న కుమారుడు మంచు మనోజ్‌ ఫిర్యాదుపై పహాడీషరీఫ్‌ ఠాణాలో కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా త‌న వాళ్లు చేసిన ఓ పని  వ‌ల్ల మంచు విష్ణు మరో వివాదంలో చిక్కుకున్నారు. జ‌ల్ ప‌ల్లిలోని అడ‌విలో విష్ణు సిబ్బంది అడ‌వి పందుల‌ను వేటాడంతో తీవ్ర చ‌ర్చ‌నీశ‌మైంది. అయితే అది పాత వీడియో అని, ఇప్పుడు హటాత్తుగా ఎందుకు వైరల్ అయ్యిందనేది హాట్ టాపిక్ గా మారింది.

Manchu Vishnu


జల్‌పల్లి అటవీప్రాంతం పక్కనే మంచు విష్ణు ఇల్లు ఉంది. అక్కడ నెమళ్లు, జింకలు, ఇతర వన్యప్రాణులు ఉన్నాయి. మోహన్‌బాబు పెద్ద కుమారుడు విష్ణుకు సంబంధించిన మేనేజర్‌ కిరణ్‌ మరో ఇద్దరితో కలిసి అడవిపందిని వేటాడి ఇంటికి తీసుకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది.

వన్యప్రాణులను శిక్షిస్తే అటవీ అధికారులు ఎలా ఊరుకుంటున్నారని సోషల్ మీడియాలో  విమర్శలు వెల్లువెత్తాయి. అడవి పందిని వేటాడి తీసుకెళుతున్న దృశ్యాలు తమ దాకా వచ్చాయని, దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ గురువారెడ్డి స్పష్టంచేశారు. వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అధికారులకు లేదా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


జ‌ల్‌ప‌ల్లి వ‌ద్ద చిట్ట అడ‌విలోకి వెళ్లి విష్ణు మేనేజ‌ర్ కిరణ్, ఎల‌క్ట్రిష‌న్ దేవేంద్ర ప్రసాద్ అడ‌వి పందిని వేటాడి అడ‌వి పందుల‌ను బంధించి తీసుకెళ్తున్న వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో విష్ణు అనుచ‌రుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఫిర్యాదులు వెళ్తున్నాయి. కాగా అడ‌వి పందులను వేటాడొద్ద‌ని మంచు మ‌నోజ్ హెచ్చ‌రించిన మేనేజ‌ర్ ఎల‌క్ట్రిష‌న్ ప‌ట్టించుకోలేదని వార్త‌లు వ‌స్తున్నారు.
 

ఇలా అడవి పందులను బంధించి వేటాడటం తప్పు అని  మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినా కూడా విష్ణు సిబ్బంది వినలేదు. అయితే అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

దీనిపై స్పందించిన పహాడిషరీఫ్‌ పోలీసులు, అటవీశాక సిబ్బంది రంగంలోకి దిగి.. ఇది పాత వీడియోగా తేల్చారు. జల్‌పల్లిలో మంచు టౌన్‌షిప్ లో మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ గత పదిహేను సంవత్సరాలుగా నివసిస్తున్నారు. 
 


వణ్య ప్రాణులను వేటాడొద్దని మంచు మనోజ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ మేనేజర్‌ కిరణ్‌, ఎలక్ట్రీషన్‌ దేవేంద్ర ప్రసాద్‌లు ఏనాడూ పట్టించుకోలేదన్న సారాంశంతో కూడిన వీడియో, కథనం వైరల్‌ అవ్వడాన్ని చూస్తే ఇది కావాలనే మంచు మనోజ్‌ వైరల్‌ చేశాడన్న ప్రచారం జరుగుతోంది. అందులో నిజమెంత తెలియదు కానీ  వీడియోలో ఉన్న వ్యక్తులు ఇప్పటి వరకు ఎన్ని వన్యమృగాలను వేటాడారన్నది వెలుగులోకి తీసుకురావాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కుటుంబ కలహాల నేపధ్యంలోనే ఈ వీడియో బయిటకు వచ్చిందంటున్నారు. 
 


 ఇప్పటికే వివాదాలు నేపధ్యంలో  మంచు విష్ణు- మంచు మనోజ్‌ల‌ను పోలీసులు బైండోవర్ చేశారు. అప్పటి నుంచి వారు ఎటువంటి గొడవలు జరగకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే, తాజాగా విష్ణు సిబ్బంది అడవి పందుల వేట వ‌ల్ల‌ ఆయన ఈ కేసులో చిక్కుకుంటున్నారు. ఈ వివాదం ఎక్కడదాకా వెళ్తుందనేది వేచి చూడాలి. 

Latest Videos

click me!