'వదినమ్మ వచ్చింది.... నీ మొగుడు వెళ్ళిండు', నిహారికపై దారుణమైన ట్రోల్స్ తో విరుచుకుపడ్డ నెటిజన్స్!


కొన్నాళ్లుగా నిహారికపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా వరుణ్-లావణ్య త్రిపాఠి పెళ్లి ఫోటో షేర్ చేస్తూ నిహారిక ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టగా... కామెంట్స్ తో ఆమెను హర్ట్ చేస్తున్నారు. 
 

Niharika Konidela

సెలెబ్రెటీలకు సోషల్ మీడియా వేధింపులు సాధారణమైపోయాయి. ఈ విషయంలో మెగా డాటర్ నిహారిక కూడా మినహాయింపు కాదు. సొంత ఫ్యాన్ బేస్ నుండి కూడా ఆమె వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కొణిదెల వారి అమ్మాయిగా నిహారిక నటించడం, బోల్డ్ ఫోటో షూట్స్ చేయడం అభిమానులకు ఇష్టం లేదు. అందుకే ఆమెను హీరోయిన్ గా ప్రోత్సహించడం లేదు. 

photo credit- niharika instagram

అయినప్పటికీ నిహారిక నటనను వదిలేది లేదని పరోక్షంగా చెప్పింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నిహారిక ఇటీవల డెడ్ ఫిక్సెల్స్ టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. నిహారిక సోషల్ మీడియా పోస్ట్స్ పై యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా వదినగా తమ ఇంట్లో అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠికి వెల్కం చెబుతూ నిహారిక ఓ పోస్ట్ పెట్టారు. 


Niharika Konidela

వధూవరులు వరుణ్-లావణ్యలతో దిగిన ఫోటో షేర్ చేసిన నిహారిక... 'వదినమ్మ వచ్చేసింది' అని కామెంట్ తో పాటు హార్ట్ ఎమోజీ జోడించింది. ఈ పోస్ట్ క్రింద కొందరు దారుణమైన కామెంట్స్ పోస్ట్ చేశారు. ఓ నెటిజన్...  'వదినమ్మ వచ్చింది నీ మొగుడు వెళ్ళిండు' అని కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ 'వాళ్ళను చెడగొట్టకు' అని కామెంట్ చేశాడు. 

Niharika Konidela

విడాకుల అనంతరం ఆమె వ్యక్తిగత ప్రైవసీ కావాలంటూ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం నిహారిక నటిగా, నిర్మాతగా రాణించే ప్రయత్నం చేస్తుంది. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసిన నిహారిక యువ దర్శకులు, రచయిలతో చర్చలు జరుపుతుంది. భవిష్యత్ లో ఆమె పలు మీడియం, స్మాల్ ప్రాజెక్ట్స్ నిర్మించనున్నారని సమాచారం.

Latest Videos

click me!