బ్యూటీ సీక్రెట్ చెప్పిన రాశీ ఖన్నా.. మేకప్ లేకున్నా మెరిసిపోతున్నా కుర్ర హీరోయిన్

First Published | Nov 2, 2023, 6:19 PM IST

టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ ముద్దుగుమ్మ బ్యూటీ సీక్రెట్ ను తాజాగా రివీల్ చేసింది. ఫొటోషూట్ కు ముందు తను ఏం చేస్తుందో తెలియజేసింది.
 

బ్యూటీఫుల్ హీరోయిన్ రాశీఖన్నా (Raashi Khanna) ప్రస్తుతం వరుస చిత్రాలతో అలరిచేందుకు సిద్ధమవుతోంది. తను నటించిన సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్, తుది దశ చిత్రీకరణలో ఉండటం విశేషం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై సందడి చేయబోతోంది.
 

ఇదిలా ఉంటే.. రాశీ ఖన్నా ఇటీవల వరుసగా సోషల్ మీడియాలో తన బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. ప్రకాశవంతమైన రూపసౌందర్యంతో మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా తన బ్యూటీ సీక్రెట్ ను రివీల్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. 
 


స్టార్ హీరోయిన్లు తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు రకరకాల టిప్స్ పాటిస్తుంటారు. ఈ క్రమంలో రాశీ ఖన్నా బ్యూటీ వెనకగా కూడా ఓ సీక్రెట్ దాగి ఉందంట. ఆమె తన స్కిన్ గ్లో అవ్వడానికి, ఫొటోషూట్స్ లో గ్లామరస్ గా కనిపించేందుకు పలు విధాలు కనిపిస్తూ మరో నియమం కూడా పాటిస్తుందంట.
 

ఫొటోషూట్ కు వెళ్లేందుకు ఐస్ వాటర్ లో మొహాన్ని ముంచేసి.. కాసేపు అలాగే ఉంటుందంట. ఇలా చేయడం ద్వారా చర్మం మరింతగా నిగనిగలాడుతుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా అభిమానులతో పంచుకుంది. మేకప్ లేకుండానే ప్రకాశవంతమైన రూపంతో ఆకట్టుకుంది. 
 

అలాగే ట్రెండీ అవుట్ ఫిట్ లో క్రేజీగా ఫొటోలకు ఫోజులిచ్చింది. స్లీవ్ లెస్ డ్రెస్ లో టాప్ గ్లామర్ తో మైమరిపించింది. మెరిసిపోయే చర్మ సౌందర్యంతో చూపుతిప్పుకోకుండా చేసింది. చిలిపి ఫోజులతో, మత్తెక్కించే చూపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

రాశీ ఖన్నా తమిళంలో నటించిన ‘అరణ్మనై 4’, ‘మేథావి’, హిందీలోని ‘యోదా’, చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. హిందీలోనే మరో చిత్రంలో నటిస్తోంది. ఇక రీసెంట్ గా టాలీవుడ్ లో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రంలో నటిస్తోంది. 

Latest Videos

click me!