లెహంగా వోణీలో మెరిసిపోతున్న షాలినీ పాండే.. పద్ధతిగానే ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ అందాల వడ్డింపు

First Published | Oct 3, 2023, 4:04 PM IST

రోజురోజుకు ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. ఎలాంటి అవుట్ ఫిట్ లో మెరిసినా మైండ్ బ్లోయింగ్ గా అందాల ప్రదర్శన చేస్తోంది. తాజాగా తన బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. 
 

యంగ్ హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey) టాలీవుడ్ తోనే తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  సరసన ‘అర్జున్ రెడ్డి’లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. తొలి చిత్రంతోనే సెన్సేషన్ గా మారింది.
 

మొదటి సినిమాతోనే షాలినీ పాండే బోల్డ్ పెర్ఫామెన్స్ తో మతులు పోగొట్టింది. ఆ తర్వాత వచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంది. 118, ఇద్దరి లోకం ఒకటే.. వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా అలరించింది. ‘మహానటి, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘నిశ్శబ్దం’ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో మెరిసింది.
 


ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీ చిత్రాల్లోనే నటిస్తోంది. గతేడాది ‘జయేశ్ బాయ్ జోర్దార్’తో ఆకట్టుకుంది. నెక్ట్స్ ‘మహారాజా’ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతర్వాత మరే చిత్రాలులేవు. ఈ క్రమంలో మరిన్ని ఆఫర్ల కోసం ఎదురు చూస్తోంది.

ఇదిలా ఉంటే.. షాలినీ నెట్టింట తరుచూగా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ బికినీ ఫొటోనే షేర్ చేసి మైండ్ బ్లాక్ చేసింది. నెట్టింట గ్లామర్ బాంబ్ పేల్చింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది.

సంప్రదాయ దుస్తుల్లో షాలినీ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. లెహంగా, వోణీ, మ్యాచింగ్ బ్లౌజ్ లో ఆకట్టుకుంది. క్యూట్ ఫోజులతో, చిరునవ్వుతో మంత్రముగ్ధులను చేసింది. షాలినీ ట్రెడిషనల్ లుక్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 
 

మరోవైపు షాలినీ ఇప్పటికే అందాల రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా పంచుకున్న ఫొటోలతోనూ పరువాలను ప్రదర్శించింది. క్లీవేజ్ షోతోపాటు, నడుము అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ ను వడ్డిస్తూ అదిరిపోయేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. 

Latest Videos

click me!