మంచు మనోజ్‌ సినిమాలో నిహారిక పాత్ర ఇదే.. వామ్మో చాలా వైల్డ్.. పదకొండు మందితో `కమిటీ కుర్రాళ్లు`..

Published : Mar 27, 2024, 05:57 AM IST

నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ లో మరింత వైల్డ్ గా ముందుకు వెళ్తుంది. ఓ వైపు హీరోయిన్‌గా,మరోవైపు నిర్మాతగా ఆమె బిజీ అవుతుంది. కెరీర్‌పై ఫుల్‌ఫోకస్‌ పెట్టింది.   

PREV
17
మంచు మనోజ్‌ సినిమాలో నిహారిక పాత్ర ఇదే.. వామ్మో చాలా వైల్డ్.. పదకొండు మందితో `కమిటీ కుర్రాళ్లు`..

మెగా డాటర్‌ నిహారిక యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. `ఒకమనసు` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ సక్సెస్‌ అందుకోలేకపోయింది. ఆ తర్వాత మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. కానీ ఏదీ సక్సెస్‌ కాలేదు.  
 

27

ఇక లాభం లేదని ప్రొడక్షన్‌లోకి అడుగుపెట్టింది. `పింక్‌ ఎలిఫెంట్ పిక్చర్స్` పేరుతో బ్యానర్‌ స్థాపించి వెబ్‌ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. కానీ మ్యారేజ్‌ లైఫ్‌సెట్‌ కాలేదు. దీంతో రెండేళ్లకి విడిపోయారు. ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. 
 

37

 ప్రస్తుతం ఆమె రెండు మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో ప్రధానంగా మంచు మనోజ్‌ సినిమా ఉండటం విశేషం. `వాట్‌ దిఫిష్‌` పేరుతో ఓ మూవీని ప్రకటించారు మంచు మనోజ్‌. ఇందులో నిహారిక కీలక పాత్రలో నటిస్తుందట. అయితే ఇందులో ఆమె పాత్రకి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో నిహారిక `అష్టలక్ష్మి` అనే పాత్రలో కనిపిస్తుందని,ఆమె యాక్షన్‌ కూడా చేస్తుందని, విలన్లని తుక్కు చేస్తుందని తెలుస్తుంది. దీనికి వరుణ్‌ కోరుకొండ దర్శకుడు.
 

47

మరోవైపు తమిళంలో ఓ సినిమా చేస్తుంది. షేన్‌ నిగమ్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తున్న `మద్రాస్‌ కారన్‌` అనే మూవీలో హీరోయిన్‌గా చేస్తుందట నిహారిక. వాలిమోహన్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలోనూ నిహారిక ఓ తమిళ సినిమా చేసింది. కానీ అది వర్కౌట్‌ కాలేదు. మరి ఇప్పుడైనా ఇటు తెలుగులో, అటు తమిళంలో సక్సెస్‌ అందుకుంటుందా అనేది చూడాలి. 

57

ఇదిలా ఉంటే సెకండ్‌ ఇన్నింగ్స్ లో మరింత వైల్డ్ గా వెల్లబోతుంది నిహారిక. నిర్మాతగానూ బిజీఅవుతుంది. తాను స్థాపించిన `పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్` బ్యానర్‌పై ఇటీవలే ఓ సినిమాని ప్రారంభించింది. ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతుంది. మలయాళ లేటెస్ట్ సంచలనం `మంజుమ్మల్‌ బాయ్స్` తరహాలో పది మందికిపైగా కుర్రాళ్లని పరిచయం చేయబోతుందట. 
 

67

ఇందులో పదకొండు మంది హీరోలను వెండితెరకి పరిచయం చేయబోతుందట నిహారిక. కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ కథతో ఈ మూవీ రూపొందుతుందని, ఇందులో పదకొండు మంది కొత్త కుర్రాళ్లని హీరోగా పరిచయం చేస్తున్నారని, అలాగే నలుగురు అమ్మాయిలకు హీరోయిన్లుగా పరిచయం చేస్తున్నట్టు టీమ్‌ నుంచి అందిన సమాచారం. ఏప్రిల్‌ మొదటి వారంలో దీనికి సంబంధించిన అప్‌డేట్‌ వస్తుందని, ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. 
 

77

ఇటీవల యూత్‌ఫుల్‌ కంటెంట్‌ చిత్రాలు బాగా ఆడుతున్నాయి. కామెడీ బాగా వర్కౌట్‌ అవుతుంది. ఇందులోనూ అలాంటి కంటెంట్ ఉంటుందని తెలుస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్‌ విసయం బయటకు వచ్చింది. ఈ మూవీకి `కమిటీ కుర్రాళ్లు` అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories