`పుష్ప`లో అల్లు అర్జున్‌ మేనరిజం కాపీనా?.. శ్రీహరి సినిమా నుంచి లేపేశారా? సుకుమార్‌ ఇలా బుక్కయ్యాడేంటి?

First Published Mar 26, 2024, 9:06 PM IST

`పుష్ప` సినిమాలో అల్లు అర్జున్‌ మేనరిజం ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. అయితే ఇది కాపీ అంటూ కొత్త వాదన తెరపైకి వచ్చింది. ప్రూప్‌లు కూడా చూపిస్తుండటం విశేషం. 
 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన `పుష్ప` మూవీ ఏ రేంజ్‌లో ఆదరణ పొందిందో తెలిసిందే. ఇందులో బన్నీ మేనరిజం బాగా పేలింది. ముఖ్యంగా ఆయన `తగ్గేదెలే` అనే డైలాగ్, అలాగే ఒక భుజం పైకెత్తి నడిచే మ్యానరిజం మరింతగా ఆకట్టుకుంది. దీన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇమిటేట్‌ చేస్తూ స్టార్స్ అయ్యారు. బిగ్‌ బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కూడా దీన్ని ఫాలో కావడం విశేషం. 
 

`పుష్ప`లో అల్లు అర్జున్‌ మేనరిజం వైరల్‌ అయ్యింది. ఇప్పుడు `పుష్ప2`తో రాబోతున్నాడు బన్నీ. దర్శకుడు సుకుమార్‌ దీన్ని మరో స్థాయిలో రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియానే కాదు, గ్లోబల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్‌, స్కేల్‌ వైజ్‌గా దీని లెక్కలు మార్చేస్తున్నాడు సుకుమార్‌. ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 
 

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో బన్నీ భుజం పైకెత్తే మ్యానరిజానికి సంబంధించి ఓ షాకింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఇది కాపీ అంటూ సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. అది ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన శ్రీహరి సినిమా నుంచి దీన్ని కాపీ కొట్టారని అంటున్నారు. ఆ సినిమాలో శ్రీహరి ఎలా ఎడమ భుజం పైకెత్తి నటించాడో, ఇప్పుడు బన్నీ అదే చేశాడని అంటున్నారు. 
 

ఆ సినిమా విషయానికి వస్తే.. పి వాసు దర్శకత్వంలో వచ్చిన `పృథ్వీ నారాయణ` మూవీ కావడం విశేషం. ఇందులో శ్రీహరి డ్యూయెల్‌ రోల్‌ పోషించాడు. పృథ్వీ, నారాయణ అనే పాత్రల్లో మెరిశాడు. ఒకటి హీరో పాత్ర అయితే, రెండోది విలన్‌ పాత్ర. పృథ్వీ పోలీస్‌, నారాయణ విలన్‌. 
 

నారాయణ పాత్ర మధ్యలో ఎంట్రీ ఇస్తుంది. తన ఫ్యామిలీకి, తనకు ద్రోహం చేసిన వారిపై పగతీర్చుకోవాలని విదేశాల నుంచి వస్తాడు. ఈ క్రమంలో ఆయన బుజం ఎత్తి కనిపిస్తాడు. సినిమాలో చాలా వరకు అలానే నటించాడు శ్రీహరి. ఆ మ్యానరిజాన్ని చాలా సహజంగా పలికించారు. పాత్రని రక్తికట్టించి విలనిజాన్ని పండించాడు. 
 

హీరోగా, విలన్‌గా శ్రీహరి తన విశ్వరూపం చూపించాడు. తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. హీరోగా కంటే విలన్‌పాత్రలతోనే ఆయన ఎక్కువగా ఆకట్టుకోవడం విశేషం. ఆ పాత్రనే హైలైట్‌గా నిలిచింది. సరిగ్గా ఇప్పుడు `పుష్ప`లోనూ బన్నీ అదే మ్యానరిజంతో నటించడంతో, అది ఇప్పుడు బయటకు తోడటంతో `పుష్ప`లోని బన్నీ భుజం ఎత్తే మ్యానరిజాన్ని సుకుమార్‌.. `పృథ్వీ నారాయణ` మూవీ నుంచే కాపీ కొట్టాడని అంటున్నారు. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. 

అంతేకాదు వీడియో క్లిప్పులు, స్క్రీన్‌ షాట్లతో సహా చూపిస్తూ ముమ్మాటికి బన్నీ మ్యానరిజం అప్పటి సినిమా నుంచి కాపీనే అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. యాదృశ్చికంగా అలా జరిగిందా? తెలియకుండా జరిగిందా లేక కావాలనే సైలెంట్‌గా లేపేశారా? అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరం. దీనిపై నెట్టింట పెద్ద రచ్చ అవుతుండటం గమనార్హం. 
 

click me!