ఈ కపుల్ సో రొమాంటిక్ గురూ... వైరల్ అవుతున్న నిహారిక హానీమూన్ ఫోటోలు!

First Published | Dec 29, 2020, 12:13 PM IST


మెగా డాటర్ నిహారిక పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో ఆమె ఏడడుగులు వేశారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ ఈ మెగా వెడ్డింగ్ కి వేదిక అయ్యింది. 

దాదాపు ఐదురోజులు ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఈ వివాహం జరిగింది. మెగా హీరోలైన చిరంజీవి, పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు శిరీష్, ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ వివాహ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
నిహారిక పెళ్ళిలో మెగా హీరోలు, వాళ్ళ వైఫ్స్ ప్రత్యేకంగా నిలిచారు. ప్రముఖ డిజైనర్స్ రూపొందించిన బట్టలు ధరించి ముస్తాబు అయ్యారు. నిహారిక, చైతన్య దంతపతులతో కలిసి వేడుకలో ప్రతి క్షణం ఆస్వాదించారు అందరు.

ఇక పెళ్ళైన కొత్త జంట నిహారిక-చైతన్య హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు. హనీమూన్ వెకేషన్ కోసం వీరిద్దరూ మాల్దీవ్స్ సముద్ర తీరానికి చెక్కేశారు.
అందమైన సాగరతీరంలో ఏకాంతంగా గడుపుతున్నారు నిహారిక, చైతన్య. సముద్ర తీరాన గల విలాసవంతమైన హోటల్స్ లో సేద తీరుతూ రొమాన్స్ చేస్తున్నారు.
హనీమూన్ వెకేషన్ సెలెబ్రేషన్స్ కి సంబందించిన ఫోటోలు నిహారిక సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన అభిమానులు ఈ కపుల్ సో రొమాంటిక్ అంటున్నారు.
చైతన్య, నిహారిక ఒకరంటే మరొకరు ఎంతో ఇష్టపడుతుండగా... ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నారు. పెళ్లి పార్టీలలోనేరొమాంటిక్ ఫోజులతో రెచ్చిపోయిన వీరిద్దరూ ఇక హనీమూన్ వెకేషన్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కాగా హీరో రామ్ చరణ్ కోవిడ్ బారినపడ్డారు. మెగా కుటుంబం మొత్తం క్రిస్మస్ కలిసి జరుపుకోగా... చరణ్ కూడా పాల్గొనున్నారు. ఆ వేడుకలో నిహారిక, చైతన్య కూడా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో హనీమూన్ వెకేషన్ లో వీరిద్దరూ కోవిడ్ టెస్ట్స్ చేయించుకొనే అవకాశం కలదు.
హనీమూన్ ని ఆసాంతం ఆస్వాదిస్తున్న వీరికి ఈ న్యూస్ కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే...

Latest Videos

click me!