తమిళ స్టార్ హీరో శింబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ లో ఉన్న రొమాంటిక్ హీరోలలో శింబు ఒకడు. బ్రేకప్ ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా శింబు గురించే చెప్పుకోవాలి. ఈ స్టైలిష్ హీరోకి లైఫ్ లో ఇంతవరకు ప్రేమ అనే మాట కలసి రాలేదు. రెండు సార్లు ప్రేమలో పడి పెళ్లి పీటల వరకు వెళ్లి విఫలం అయ్యాడు. లేడి సూపర్ స్టార్ నయనతార, ఆపిల్ బ్యూటీ హన్సిక తో శింబు నడిపిన ప్రేమ వ్యవహారాలు సౌత్ లో హాట్ టాపిక్.