ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం తో స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. సినిమా ఈవెంట్ కోసం హైదరాబాద్ కు వచ్చిన ఆమెను ఉక్కిరిబిక్కిరిచేశారు అభిమానులు. కాసేపు ఊపిరాడకుండా చేశారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో ఆమెకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజా సాబ్. ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. కాగా ఈమూవీ ప్రమోషనర్స్ ఊపందుకున్నాయి. ఈక్రమంలోనే రాజాసాబ్ సినిమాలోని ‘సహన సహన’ పాటను రిలీజ్ చేశారు టీమ్. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ను బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిధి అగర్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్ ప్రశాంతంగా కంప్లీట్ అయ్యింది. కానీ హీరోయిన్ బయటకు వెళ్లే సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
25
హీరోయిన్ నిధి అగర్వాల్‌కు చేదుఅనుభవం..
రాజా సాబ్ సాంగ్ ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లేందుకు నిధి ప్రయత్నిస్తుండగా, ప్రభాస్ అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. జనం ఒక సమూహంగా వచ్చి మీద పడటంతో.. ఆమె కారు దగ్గరకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. ఈ ఘటనతో నిధి అగర్వాల్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న బౌన్సర్లు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించి, ఎంతో శ్రమించి ఆమెను సురక్షితంగా కారు దగ్గరకు తీసుకొచ్చారు.
35
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో, సెలబ్రిటీల భద్రతతో పాటు సినిమా ఈవెంట్ల నిర్వహణపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వైరల్ వీడియోలో గుంపులు గా ఉన్న జనాల మధ్య నుంచి.. తన కారు దగ్గరకు వెళ్లడానికి.. నిధి అగర్వాల్ ఎంత ఇబ్బంది పడింది అనేది స్పష్టంగా కనిపించింది. ఎలాగోలా.. కారు వరకూ వెళ్లి.. చివరకు కారులోకి ఎక్కిన వెంటనే ఆమె ఊపిరి పీల్చుకుని '' మై గాడ్ ” అని వ్యాఖ్యానించినట్లు వీడియోలో వినిపిస్తోంది.
ఈ ఘటనపై పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సంచలన గాయని చిన్మయి శ్రీపాద ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్న మగవాళ్ల గుంపు. ఇది వేధింపు కాదా?” అంటూ ఆమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మరోవైపు, ఈవెంట్ ను నిర్వహించినవారిపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈతప్పు అక్కడి అభిమానులది కాదు.. మూవీ టీమ్‌దే. ఇంత చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారు? నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సెలబ్రిటీల బద్రతపై ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా.. మరికొందరు మాత్రం “వీళ్లు అభిమానులు కాదు, అభిమానుల ముసుగులో ఉన్న రాబందులు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
55
ఎలాంటి ప్రకటన చేయని రాజాసాబ్ టీమ్..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఘటనపై నిధి అగర్వాల్ కానీ, ‘ది రాజా సాబ్’ మూవీ టీమ్ కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. ముందు ముందు ఏమైనా స్పందిస్తారేయో చూడాలి. ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. హారర్ కామెడీ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ మూవీలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.