ఇంకా ఆమె చెబుతూ, `హీరో` చిత్రంలో డాక్టర్ పాత్రలో కనిపిస్తానని తెలిపింది. అయితే డాక్టర్ పాత్ర తనకు సెంటిమెంట్‌గా మారిందని, అలాంటి పాత్రలు చేసిన సినిమాలన్నీవిజయం సాధిస్తున్నాయని చెప్పింది. `ఇస్మార్ట్ శంకర్`, తమిళంలో నటించిన చిత్రంలో కూడా డాక్టర్‌గానే నటించానని, అదికూడా హిట్ అయిందని, ఇప్పుడు `హీరో` సినిమా కూడా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తంచేసింది. అయితే హీరో అశోక్ గల్లాకి తను డాన్సు ట్రిప్స్ చెప్పిందట.