మెగా ఫ్యామిలీలో కొత్త కోడలు సమక్షంలో దీపావళి సెలబ్రేషన్‌.. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా లావణ్యత్రిపాఠి..

First Published | Nov 13, 2023, 7:51 AM IST

మెగా కొత్త జంట వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి పెళ్లి అయిన తర్వాత మొదటి సారి దీపావళి పండుగని సెలబ్రేట్‌ చేసుకున్నారు. కొత్త కోడలి సమక్షంలో దివాళీ మెగా బ్రదర్‌ ఇంట్లో కొత్త సందడి తీసుకొచ్చింది.

మెగా ఫ్యామిలీలోకి ఇటీవలే కొత్త కోడలు ఎంట్రీ ఇచ్చింది. వరుణ్‌ తేజ్‌, లావణ్యత్రిపాఠి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటలీలో చాలా గ్రాండ్‌ గా వీరి పెళ్లి జరిగింది. ఇందులో మెగా ఫ్యామిలీ, అతికొద్ది మంది సినీ ప్రముఖులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. 

పెళ్లి తర్వాత ఈ నెల 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించారు. అయితే దీనికి పెద్దగా సినీ ప్రముఖులు హాజరు కాకపోవడం ఆశ్చర్యకరం. అందరికి ఇన్విటేషన్‌ లేదా? లేక రాలేదా? కానీ రిసెప్షన్‌ అంతగా ఎట్రాక్షన్‌గా నిలవలేదు. 


ఇక కొత్త కోడలు వచ్చిన ఆనందంలో ఉన్న మెగా బ్రదర్‌ నాగబాబు.. తమ ఇంట్లో మొదటి దీపావళి సెలబ్రేట్‌ చేసుకున్నారు. కొత్త జంట వచ్చిన తర్వాత వచ్చిన మొదటి దివాళీ కావడంతో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. పండగంతా కొత్త జంటలోనే ఉందనేలా వీరు సందడి చేయడం విశేషం. 

Varun Tej and Lavanya Tripathi

దీపావళి సెలబ్రేషన్‌లో లావణ్యతోపాటు మెగా డాటర్‌ నిహారిక కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె రెడ్‌ శారీలో మెరిసింది. నాన్న కూచిలా ఆమె సందడి చేసింది. మరోవైపు నాగబాబు, ఆయన సతీమణి, వరుణ్‌ తేజ్‌, లావణ్య, నిహారిక ఇలా నలుగురు తమ ఇంటిని గ్రాండ్‌గా డెకరేట్‌ చేసి దివాళి సెలబ్రేట్‌ చేసుకున్నారు.

రాత్రి బాణాసంచా కాలుస్తూ, కాకర పుల్లలు, చిచ్చు బుడ్డీలు కాలుస్తూ ఎంజాయ్‌ చేశారు. పండగంతా మాలోనే ఉందని చాటి చెప్పారు. ఇక ఈ ఫోటోలను, వరుణ్‌, లావణ్య, నిహారిక సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి `మిస్టర్‌` సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ సినిమా వీరిద్దరి మధ్య ప్రేమకు పునాది వేసింది. దాదాపు ఆరేడు ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట గతేడాది తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. అంతేకాదు, లావణ్యకి రింగ్‌ కోనివ్వడం చేశాడు. దీంతో ఈ ఇద్దరి లవ్‌ స్టోరీ లీక్‌ అయ్యింది.

చాలా రోజులు సీక్రెట్‌గా మెయింటేన్‌ చేసిన ఈ జంట ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని, నవంబర్‌ 1న ఇటలీలో డెస్టినీ వెడ్డింగ్‌ చేసుకున్నారు. 
 

Latest Videos

click me!