Guppedantha Manasu: జగతిని ఎండీ స్థానంలో కూర్చోబెట్టిన రిషి.. రిషి కోసం కాలేజీకి వచ్చిన వసు?

First Published Jan 17, 2023, 8:58 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్లో నేను ఎవరో తెలియనికొత్త ప్రదేశానికి వెళ్తాను అంటాడు రిషి. మళ్ళీ కొత్తగా పుట్టినట్టు తిరిగి వస్తాను. ఎప్పుడొస్తావ్ అని మహేంద్ర అడగగా ఏమో వస్తానో రానో నాకు కూడా తెలియదు అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర రిషిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. నువ్వు వెళ్లి ఈ డాడ్ ని ఒంటరి వాడిని చేస్తావా అని అనగా అందరిలో ఉన్న నేను ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాను డాడ్, నన్ను చూస్తే మీరు ఇంకా బాధపడతారు అందుకే వెళ్తున్నాను నన్ను వెళ్ళనివ్వండి అంటాడు. అప్పుడు రిషి దేవయానికి చేతిలో చేయి వేసి లగేజ్ తీసుకొని వెళుతుండగా అప్పుడు జగతి ఆపి నువ్వు వెళ్తే వెళ్ళు వద్దు అని అధికారం నాకు లేదు కానీ కాలేజీలో ఒక్కసారి చెప్పు అని అంటుంది.

అప్పుడు ఫణింద్ర జగతి చెప్పింది కూడా నిజమే అని అంటాడు. నీకు పెదనాన్నగా చెప్తున్నాను కాలేజీలో మీటింగ్ పెట్టు కాలేజీలో అందరికీ చెప్పిన తర్వాతే వెళ్ళు అని అంటాడు. అప్పుడు రిషి ఏం మాట్లాడకుండా లగేజ్ అక్కడే వదిలేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. దాంతో అందరూ బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత జగతి రిషి అందరూ కాలేజీకి వెళ్తారు. అప్పుడు రిషి కారు దిగగానే ఎప్పుడు నీతో కలిసి నేను కార్ దిగేవాడిని కానీ ఇప్పుడు నీ జ్ఞాపకాలతో కాలేజీకి వస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జగతి కూడా అచ్చం రిషి లాగే ఇద్దరు ఎప్పుడు కలిసి దిగేవారు కానీ బరువెక్కిన హృదయంతో జ్ఞాపకాలతో కాలేజీకి వచ్చాడు అనుకుంటూ ఉంటుంది.
 

అప్పుడు వసుధారతో గడిపిన ప్రదేశానికి వెళ్లి ఆ జ్ఞాపకాలు గుర్తుతెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు రిషి. వసుతో కలిసి ఆడిన ఆటలు గడిపిన క్షణాలు అన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో మహేంద్ర ఫోన్ చేసి అందరూ ఎదురుచూస్తున్నారు రా నాన్న అనడంతో వస్తున్నాను అని చెప్పి అక్కడికి వెళ్తాడు రిషి. తరువాత రిషి మీటింగ్లో మాట్లాడుతూ ఇప్పుడు మీటింగ్ అరేంజ్ చేయడానికి పెద్దగా కారణాలు ఏమీ లేవు డిబిఎస్ టి కాలేజ్ ని అందరి సహాయ సహాయకారాలతో ముందుకు మంచి స్థానానికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు మీరు నాకు ఎంతో అండగా ఉన్నారు ఇప్పుడు కూడా మీరు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు రిషి.
 

 డిబిఎస్ టి కాలేజీ ఎండి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను అనడంతో కాలేజీ స్టాఫ్ అందరు ఆశ్చర్యపోతారు. ఎందుకు ఏమీ అని అడగవద్దు. ఇది నా పర్సనల్ నాకు విశ్రాంతి కావాలి, చాలా అలసిపోయాను అని అంటాడు రిషి. అప్పుడు కాలేజ్ స్టాఫ్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో  అప్పుడు మహేంద్ర చెప్పారు కదా ఇందాకే అలసిపోయాను చిన్న బ్రేక్ కావాలని అందుకే అంటాడు. ఈ విషయాన్ని నోటీస్ బోర్డ్ లో పెట్టించండి మీటింగ్ ఓవర్ అని చెబుతాడు. అప్పుడు కాలేజీ స్టాప్ అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. అప్పుడు మహేంద్ర ఫణీంద్ర వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోకుండా రిషి నా మనసుకు అయిన గాయం మానాలి అంటే కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందే నేను వెళ్తాను అని అంటాడు. 
 

నా మనసులో నేను లేను అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు రిషి. నేను లగేజ్ తెచ్చుకున్నాను ఇటు నుంచి ఇటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతాను అనడంతో అందరూ షాక్ అవుతారు. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు చెప్పకుండా వచ్చాను ఒక మాట చెప్పండి వాళ్లకు కోపం వచ్చినా బాధ వచ్చినా నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను అని అంటాడు. ఆ తర్వాత రిషి జగతి దగ్గరికి వెళ్లి జగతి చెయ్యి పట్టుకుని పిలుచుకొని వచ్చి తన సీట్ లో కూర్చోబెడతాడు. అప్పుడు జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు మహేంద్ర,జగతి చేతులు కలుపుతూ డాడ్ జాగ్రత్త మేడం, కాలేజీ కూడా అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

 ఆ తర్వాత అందరికీ వెళ్ళొస్తాను అని చెప్పి రిషి ఎక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఇంతలోనే వసుధార లగేజ్ తీసుకొని కాలేజీకి వస్తుంది. అప్పుడు రిషి వసుధారనీ చూసి కూడా తన బ్రమ అనుకుని వెళ్ళిపోతుండగా వసుధార రిషిని చూసి సార్ అని పిలవడంతో కారు ఆపుతాడు. అప్పుడు వసుధార అన్న మాటలు గుర్తు తెచ్చుకొని పిలుస్తున్న పలకకుండా నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర జగతి ఇద్దరు రిషి క్యాబిన్ కి వెళ్లి బాధపడుతూ ఉంటారు. అప్పుడు జగతి, రిషి సీట్ల కూర్చోడానికి ఇబ్బంది పడుతూ ఉండగా మహేంద్ర కూర్చోబెడతాడు. ఇంతలోనే వసుధర అక్కడికి రావడంతో జగతి మహేంద్ర ఇద్దరు షాక్ అవుతారు.
 

అప్పుడు జగతి వసుధార మెడలో ఉన్న తాళిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మళ్లీ ఎందుకు వచ్చావు అని అంటుంది జగతి. అదేంటి మేడం అలా అంటారు. మిషన్ ఎడ్యుకేషన్ హెడ్గా నన్ను ఎన్నుకున్నారు కదా ఆ వర్క్ స్టార్ట్ చేయమని మినిస్టర్ గారి నుంచి మెయిల్ రావడంతో వచ్చాను మేడం అని అంటుంది. అప్పుడు మహేంద్ర జగతి మేడం ఎప్పుడు డిబిఎస్టి కాలేజీ కొత్త ఎండి అనడంతో వసుధార షాక్ అవుతుంది. రిషి సార్ ఎక్కడికి వెళ్ళారు మేడం అనడంతో కనిపించని భవిష్యత్తును వెతుక్కుంటూ మాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అనడంతో వసుధార షాక్ అవుతుంది.

click me!