ది డిప్లొమాట్ సీజన్ 4
రాజకీయ పరిణామాలు, రహస్య ప్రణాళికల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ నాలుగో సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికా అధ్యక్షురాలు గ్రేస్ పెన్ పాత్రలో అలిసన్ జానీ, ఉపాధ్యక్షుడు హాల్ వైలర్ పాత్రలో రూఫస్ సెవెల్ నటించారు. శక్తిమంతమైన రష్యా అణ్వాయుధాన్ని దొంగిలించేందుకు వీరిద్దరూ అత్యంత రహస్యమైన, ప్రమాదకరమైన ప్రణాళికను రూపొందించడం ఈ కథలో కీలక అంశం.
రిలీజ్ డేట్: అక్టోబర్ 15, 2026
ఎక్కడ చూడాలి: నెట్ఫ్లిక్స్
ది స్టార్మ్
జోసెఫిన్ బోర్నెబుష్ దర్శకత్వం వహించిన ఈ స్వీడిష్ డార్క్ కామెడీ కుటుంబ వేడుకలో చోటుచేసుకునే అనూహ్య పరిణామాల చుట్టూ తిరుగుతుంది. ఫిలిప్ 45వ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హింసాత్మక స్టార్మ్ ఆటంకం కలిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుందనేది సినిమాలో ఆసక్తికరంగా ఉండనుంది.
రిలీజ్ డేట్: అక్టోబర్ 15, 2026
ఎక్కడ చూడాలి: నెట్ఫ్లిక్స్
శాక్రిఫైస్
హాలీవుడ్ నటుడు మైక్ టైలర్ చుట్టూ సాగే వ్యంగ్యభరిత యాక్షన్ అడ్వెంచర్ చిత్రమిది. క్రిస్ ఎవాన్స్ ఈ పాత్రలో కనిపించనున్నారు. ఓ అవమానకరమైన సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తన ప్రతిష్ఠను తిరిగి నిలబెట్టుకోవాలని మైక్ ప్రయత్నిస్తాడు. ఆ క్రమంలో ఎదురయ్యే పరిణామాలే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
రిలీజ్ డేట్: అక్టోబర్ 16, 2026
ఎక్కడ చూడాలి: నెట్ఫ్లిక్స్