డెలివరీ నుస్రత్ జహాన్ కోల్‌కతాలోని భగీరథి నియోటియా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయినప్పుడు, ఆమె బాయ్‌ఫ్రెండ్, నటుడు-రాజకీయవేత్త యశ్ దాస్‌గుప్తా నవజాత శిశువును కారు వద్దకు తీసుకువెళ్లారు. నుస్రత్ తల్లి అయిన తర్వాత యష్ అభిమానులు, శ్రేయోభిలాషులతో ఒక పోస్ట్ కూడా పెట్టాడు... "నుస్రత్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్న వారికి, తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు" అని ఆయన చెప్పారు.
కాగా, బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రసవం కోసం బుధవారం రాత్రి కోల్ కతా పార్క్ స్ట్రీట్ లోని భగీరథ నియోతియాలో చేరారు. సిజేరియన్ అయిందనీ, తల్లీ బిడ్డ ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నారని బెంగాలీ నటుడు, నుస్రత్ స్నేహితుడు యష్ దాస్ గుప్తా ప్రకటించారు.