‘లవ్‌స్టోరి’: సాయి పల్లవిపై అత్యాచారం? అదే కీలక మలుపు

Surya Prakash   | Asianet News
Published : Sep 09, 2021, 07:34 AM IST

 ఈ నెలలో లవ్ స్టోరీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే లవ్ స్టోరీ కథపై రూమర్స్ వస్తున్నాయి.  

PREV
19
‘లవ్‌స్టోరి’: సాయి పల్లవిపై అత్యాచారం? అదే కీలక మలుపు

sai pallavi love story naga chaithanya 

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో  శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌స్టోరీ’.ఈ సినిమా ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేసారు. ఆ తర్వాత వినాయక చవితి సందర్బంగా సినిమా రిలీజ్ చేస్తామన్నారు కానీ అదీ జరగలేదు. రెండు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాక విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు.  ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల సమస్య కొలిక్కి రావడం లేదు. అక్కడ కరోనా ఆంక్షలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి.

29
Love story

గత కొద్ది రోజులుగా శేఖర్ కమ్ముల రీషూట్ లు పెట్టారు.  కొన్ని ట్రాన్సిక్షన్ షాట్స్, ప్యాచ్ అప్ సీన్స్  ఈ రీసెంట్ షెడ్యూల్ లో షూట్ చేసారు.  మొత్తానికి అన్ని పనులు పూర్తి అయ్యాయి. దాంతో వాయిదా అనవసరం అని ఓ డేట్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. 

39
love story


 శేఖర్ కమ్ముల మరోసారి భావోద్వేగ ప్రేమకథతోనే వస్తున్నా కానీ ఈసారి మరింత స్ట్రాంగ్ పాయింట్ ను తీసుకున్నాడని అంటున్నారు.   పాటను అందంగా చిత్రీకరించినా, మాటను ఆకట్టుకునేలా పలికినా, విలువలకు పట్టంకట్టినా, అబాలగోపాలం అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమాను చూసినా అది శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభకే చెల్లింది. స్టార్.

49
love story

తనదైన మేకింగ్ స్టైల్ తో, వినూత్నతను ప్రదర్శిస్తూ ,యూత్ కు మెసేజ్ ఇస్తూ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు శేఖర్ కమ్ముల, ఈయన సినిమాలలో స్టార్ లుండరు.   కథే సినిమాకు స్టార్. శేఖర్ కమ్ముల సినిమాలు మిడిల్ క్లాస్ జీవితాలలోని వాస్తవికతను ప్రతిబించేలాగా ఉంటాయి. వివిధ సందర్భాల్లో మనుషుల భావోద్వేగాలు, సందర్భాన్ని బట్టి మారే మనస్తత్వాలను అత్యంత సహజంగా పట్టి చూపడంలో శేఖర్ కమ్ముల మంచిదిట్ట.

59
love story

శేఖర్ కమ్ముల సినిమా లలో ప్రత్యేకంగా చెప్పు కోవాల్సిన మరో అంశం హీరోయిన్....బాపు తర్వాత అంత అందంగా హీరోయిన్ ని చిత్రీకరించే దర్శకుడు శేఖర్ కమ్ములనే. ఈయన హీరోయిన్స్ ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో, తమ దైన డైలాగ్ మాడ్యులేషన్ లతో అలరిస్తాయి. ఈ సారి లవ్ స్టోరీ లో కూడా అదే ఫంధాలో వెళ్లారట. హీరోయిన్ చుట్టూనే కథ తిరగబోతోందిట.

69


రూరల్ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన హీరో హీరోయిన్లు హైదరాబాద్ వంటి మహా నగరంలో ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో సాయి పల్లవి పాత్రపై అత్యాచార ప్రయత్నం కూడా జరుగుతుందిట. అక్కడ నుంచే కథ మలుపు తిరుగుతుంది అంటున్నారు.  శేఖర్ కమ్ముల మరోసారి భావోద్వేగ ప్రేమకథతోనే వస్తున్నా కానీ ఈసారి మరింత స్ట్రాంగ్ పాయింట్ ను తీసుకున్నాడని అంటున్నారు.  ఇవన్ని ఎంత వరకూ నిజమో అంటే కొద్ది రోజులు రిలీజ్ దాకా ఆగాల్సిందే.
 

79
love story


ఫైనల్ కట్ ప్రస్తుతం ప్రిపేర్ అవుతోంది. అవుట్ ఫుట్ చూసుకున్న  శేఖర్ కమ్ముల చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ క్రమంలో దర్శ క,నిర్మాతలు కలసి రిలీజ్ డేట్ పై కసరత్తులు చేస్తున్నారు. సెప్టెంబర్ 24 లేదా 30న ఈ సినిమాని విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. సాధ్యమైనంత మేరకు సెప్టెంబర్ 24 కావచ్చు అంటున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన రావచ్చు. అన్ని పరిస్థితులు అక్కడ అనుకూలం కాగానే... ఏ క్షణంలోనైనా ‘లవ్‌స్టోరి’ విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

89
love story

 ‘లవ్‌స్టోరీ’లోని పాటలు విశేషంగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘సారంగదరియా’ పాట విశేష ప్రజాదరణ పొందింది. అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.   ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి సంగీతం: పవన్‌ సి.హెచ్‌., ఛాయాగ్రహణం: విజయ్‌ సి. కుమార్‌, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌. 

99
love story

ప్రతీ అమ్మాయి తమ యవ్వన దశలో ఎదుర్కొనే వ్యక్తిగత సమస్యను ఈ సినిమాలో చూపించబోతున్నాడు కమ్ముల.  ఈ సినిమాలో ఓ సంచలన పాయింట్ చూపించబోతున్నాడు శేఖర్ కమ్ముల అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు తెలుగులో ఏ దర్శకుడు చెప్పని కథను ఇందులో చూపించబోతున్నాడు. దానికి ప్రేమకథను జోడించి కథ తెరకెక్కిస్తున్నాడు అంటున్నారు.

click me!

Recommended Stories