Karthika Deepam: వంటలక్క, డాక్టర్ బాబు మరణం.. ప్రాణాలతో తిరిగి వచ్చిన హిమ.. పగతో రగిలిపోతున్న శౌర్యా!

Published : Mar 12, 2022, 09:01 AM ISTUpdated : Mar 12, 2022, 09:14 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Karthika Deepam: వంటలక్క, డాక్టర్ బాబు మరణం.. ప్రాణాలతో తిరిగి వచ్చిన హిమ.. పగతో రగిలిపోతున్న శౌర్యా!
Karthika Deepam

మోనిత నేను చచ్చేంత వరకు కార్తీక్ (Karthik) ప్రేమ నాతోనే ఉంటుంది అని ఏడ్చుకుంటూ చెబుతుంది. అలాగే వెళ్లేముందు మోనిత (Monitha).. కార్తీక్ నాతో ఉంటే గుండెల్లో ఉండేవాడు. దీపతో ఉన్నాడు కాబట్టి ఈ ఫోటో లో ఉన్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత ఇంద్రుడు చంద్రమ్మ (Chandramma) లు మెడిసిన్ కొనడానికి డబ్బులు లేక ఒక వ్యక్తి దగ్గర డబ్బులు కొట్టేస్తారు.
 

26
Karthika Deepam

మరోవైపు సౌర్య.. హిమ (Hima) కు సంబంధించిన వస్తువులు అన్ని నేలపై విసిరేస్తూ హిమ నే అమ్మ నాన్నలను చంపేసింది అంటూ ఏడ్చుకుంటూ చెబుతుంది. అంతేకాకుండా హిమ చేసిన పనికి ఈరోజు నేను అమ్మ నాన్న లేని అనాధను అయ్యాను అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది సౌర్య (Sourya).
 

36
Karthika Deepam

ఆ క్రమంలో సౌందర్య (Soundarya) సౌర్య ను అది కాదు రౌడీ అని పిలవగా నన్ను అలా పిలవద్దు అమ్మానాన్నల తోనే ఆ సౌర్య చచ్చిపోయింది అంటూ గట్టిగా ఏడ్చేస్తుంది. అంతేకాకుండా అమ్మానాన్నల చావుకు కారణమైన అది ఎక్కడో ఒకచోట బతికే ఉంటుంది అని సౌర్య (Sourya) చెబుతుంది.
 

46
Karthika Deepam

ఇక ఇంద్రుడు (Indrudu) చంద్రమ్మ వాళ్ల ఇంట్లో సృహ లోకి వచ్చిన హిమ నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతుంది. దాంతో ఇంద్రుడు నువ్వు ఒక లోయలో చెట్టుకు చిక్కుకొని కనిపించావ్ అమ్మ అని చెబుతాడు. ఆ తర్వాత హిమ (Hima) జరిగినది అంతా గుర్తుతెచ్చుకొని ఏడుస్తుంది.
 

56
Karthika Deepam

ఇక అలా ఏడుస్తున్న హిమ (Hima) ను చంద్రమ్మ దగ్గరకు తీసుకొని ఓదార్చు తుంది. మరోవైపు సౌర్య హిమ ఫోటోను బయట విసిరేసి దాని గుర్తులు ఏవి ఈ ఇంట్లో ఉండకూడదు అని అంటుంది. అంతేకాకుండా హిమ ను వదిలిపెట్టను నానమ్మ అని సౌర్య (Sourya) అంటుంది.
 

66
Karthika Deepam

ఇక ఫోటో విసిరేస్తున్న క్రమంలో హిమ (Hima) వస్తుంది. కానీ సౌర్య మాటలు విని బయటే ఆగిపోతుంది. ఇక సౌర్య.. హిమ అమ్మా నాన్నలను మింగేసిన రాక్షసి దాని పేరు ఈ ఇంట్లో ఎత్తితే నేను మీకు దక్కను అని సౌర్య (Sourya) అంటుంది. ఇక ఆ మాటలు విని హిమ అక్కడినుంచి బాధతో వెళ్ళిపోతుంది.

click me!

Recommended Stories