Kajal Baby Bump: భర్తతో కలిసి క్యాండిడ్‌ ఫోటో పంచుకున్న కాజల్‌.. బేబీ బంప్ తో ఆనంద క్షణాలు.. అన్‌సీన్‌ పిక్స్

Published : Mar 11, 2022, 10:00 PM IST

కాజల్‌.. రాబోతున్న మాతృత్వపు క్షణాలను ఆనందించే పనిలో బిజీగా ఉంది. గర్బవతి కావడంతో బేబీ బంమ్స్ తో ఆమె తనజీవితంలోని మరో ఫేజ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ప్రతి క్షణాన్ని ఒడిసిపట్టుకుంటూ ఆనందిస్తుంది.  

PREV
19
Kajal Baby Bump: భర్తతో కలిసి క్యాండిడ్‌ ఫోటో పంచుకున్న కాజల్‌.. బేబీ బంప్ తో ఆనంద క్షణాలు.. అన్‌సీన్‌ పిక్స్

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం గర్భతిగా ఉన్నారు. ఆమె ఈ ఏడాది పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నారు. దీంతో ఆ ఆనందన క్షణాలను ఆస్వాదిస్తుంది. ఆమెలోని ఆనందాన్ని తను మాత్రమే పొందడం లేదు. తన అభిమానులకు కూడా పంచుతుంది. ఫోటోల రూపంలో తన ఆనందాన్ని బంధించి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫ్యాన్స్ తో షేర్‌ చేస్తుంది కాజల్‌. 

29

లేటెస్ట్ గా ఆమె ఓ క్యాండీడ్‌ పిక్‌ని షేర్‌ చేసింది. తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి దిగిన ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోని షేర్‌ చేసింది. ఇందులో కాజల్‌ వైట్‌ షర్ట్, బ్లాక్‌ స్కర్ట్ ధరించారు. తన బేబీ బంప్‌పై చేయి వేసి పైకి చూస్తూ నవ్వులు పూయిస్తుండగా, ఆమె నవ్వులకు ఫిదా అయిన భర్త గౌతమ్‌ కిచ్లూ అలా చూస్తుండిపోతుండగా కెమెరా క్లిక్‌ మనిపించింది. ఆ పిక్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

39

బెస్ట్ ఎవర్‌ క్యాండీడ్‌ పిక్‌గా కాజల్‌ ఈ లేటెస్ట్ ఫోటో నిలవడం విశేషం. చూడ్డానికి కనువిందుగానూ, ఆకట్టుకునేలా ఉందీ ఫోటో. దీంతో ఇది చూసి ఆమె అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభినందనలు తెలియజేస్తున్నారు. 

49

మరోవైపు మరికొన్ని అన్‌సీన్‌ పిక్స్ ని షేర్‌ చేసింది కాజల్‌. `హే సినామికా` ప్రమోషన్‌లో భాగంగా ఈ పిక్‌ అన్‌ సీన్‌ ఫోటోలను పంచుకుంది. అత్యంత సహజంగా ఉన్న కాజల్‌ లుక్స్ నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. ఈ ఫోటోలు సైతం అలరిస్తున్నాయి. 
 

59

కాజల్‌, గౌతమ్‌ కిచ్లు 2012 నుంచే పరిచయం. అప్పటి నుంచి స్టార్ట్ అయిన వీరి పరిచయం ప్రేమగా మారింది. అయితే అన్నాళ్లు సీక్రెట్‌గా దాచిన కాజల్‌ రెండేళ్ల క్రితం తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ఎంగేజ్‌మెంట్‌ అయిపోయాక ఈ విషయాన్ని వెల్లడించింది. 

69

2020 అక్టోబర్‌ మొదటి వారంలో తాను `ఎస్‌` చెప్పినట్టు పేర్కొంటూ ఓ నోట్‌ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాదు మ్యారేజ్‌ డేట్‌ని కూడా ప్రకటించింది. అన్నట్టుగానే అక్టోబర్‌ 30న కరోనా నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. 

79

ఏడాది తర్వాత 2022లో కొత్త సంవత్సరం ప్రారంభంలో భర్త గౌతమ్‌ కిచ్లు కాజల్‌ ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది తమ జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్నట్టు, ఇది తమకు చాలా స్పెషల్‌ అని వెల్లడించారు. ఆ తర్వాత కాజల్‌ సైతం తన ప్రెగ్నెన్సీని వెల్లడించింది. బాడీ షేమింగ్‌ గురించి ఆమె స్పందించింది. 
 

89

ఇదిలా ఉంటే కాజల్‌ ఇటీవల తమిళంలో నటించిన `హే సినామిక` చిత్రం విడుదలైంది. దుల్కర్‌ సల్మాన్‌, అదితి రావు హైదరీ, కాజల్‌ నటించిన ఈ సినిమా గత వారం విడుదలై పరాజయం చెందింది. 

99

మరోవైపు కాజల్‌ ఇప్పుడు తెలుగులో చిరంజీవి సరసన నటించిన `ఆచార్య` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఏప్రిల్‌ 29న విడుదల కాబోతుంది. దీంతోపాటు తమిళంలో ఓ చిత్రం, హిందీలో ఓ సినిమా చేసింది కాజల్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories