ప్రభాస్ (Prabhas) హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (jacqueline fernandez Pics) గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. తాజాగా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ‘సాహో’ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఒక్క సాంగ్ తోనే సౌత్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది.
26
బాలీవడ్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న జాక్వెలిన్ అదే తరహాలో వివాదాలకు గురవుతున్నారు. గతేడాది తీహార్ జైల్ లో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ వలలో పడిన విషయం తెలిసిందే. అయితే తనకు కార్లు, గిఫ్ట్స్ ఇచ్చినట్టుగా సుకేశ్ చంద్రశేఖర్, జాక్వెలిన్ ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
36
ఇటీవల మరో ముుగ్గురు బాలీవుడ్ తారలు.. సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, భూమి ఫెడ్నేకర్ పేర్లను కూడా ఈ మోసగాడి టార్గెట్ లో ఉన్నారని ఈడీ తన దర్యాప్తులో తెలిపింది. కాగా వీరంతా సుకేశ్ నుంచి ఎలాంటి బహుమతులు, మనీ.. తీసుకోలేదని తెలుపుతున్నారు.
46
ఇదిలా ఉండగా.. తాజాగా జాక్వెలిన్ శిల్పాశెట్టి హోస్ట్ చేస్తున్న షేప్ ఆఫ్ యు షోకు హాజరైంది. ఈ సందర్భంగా తన అట్రాక్టివ్ అవుట్ ఫిట్ లో ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. అద్భుతమైన బ్లూ రిబ్డ్ స్మాల్ బాడీకాన్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది.
56
ఈ సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శిల్పాశెట్టితో చేసిన డాన్స్ వీడియోను, ఫొటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ఇద్దరు సుందరీలు కలిసి నర్తించడంతో ఆడియెన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. "ఐ యామ్ ఫీలింగ్ గుడ్" పాటతో తన దుస్తులను చూపించే రీల్‌లో వీరిద్దరూ వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లు లైక్ లతో, కామెంట్లతో పొగుడుతున్నారు. ఇదే రీల్ ను శిల్పా శెట్టి కూడా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పంచుకుంది. జాక్వెలిన్ తమ రీల్ కు ‘తమాషాకు’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
66
ఇక కేరీర్ లో జాక్వెలిన్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన ‘బచ్చన్ పాండే’ మూవీలోనూ నటిస్తోంది జాక్వెలిన్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలనూ తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను అట్రాక్ట్ చేస్తోంది.