నాగచైతన్య-సమంత విడాకులుః పర్సనల్‌ డిజైనర్‌పై నెటిజన్ల దారుణంగా ట్రోలింగ్‌

Published : Oct 03, 2021, 07:13 PM IST

నాగచైతన్య, సమంత విడాకులు విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. కానీ వీరిద్దరు విడిపోవడానికి చాలా కారణాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం ట్రోల్‌ అవుతుంది. సమంత డిజైనర్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

PREV
16
నాగచైతన్య-సమంత విడాకులుః పర్సనల్‌ డిజైనర్‌పై నెటిజన్ల దారుణంగా ట్రోలింగ్‌

నాగచైతన్య, సమంత కలిసి శనివారం తమ విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించి షాకిచ్చారు. అయితే తాము విడిపోవడానికి కారణాలు చెప్పలేదు. దీంతో ఊహగానాలు ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. ఎవరికి తోసినట్టు వాళ్లు కారణాలు చెబుతున్నారు. వీరిద్దరు విడిపోయేందుకు దారి తీసిన విషయాలను వెతికే పనిలో పడ్డారు. 

26

సామ్‌-చేలు విడిపోవడానికి సమంత నటించిన బోల్డ్ రోల్స్ అనే టాక్‌ వినిపిస్తుంది. `సూపర్‌ డీలక్స్`, `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`లో బోల్డ్ అండ్‌ ఇంటిమేట్‌ సీన్లు చేయడం, అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్లకి పోజులివ్వడం వంటివి అక్కినేని ఫ్యామిలీకి మింగుడు పడలేదని, దీంతో సమంత, చైతూల మధ్య క్లాషెస్‌ స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. దీనికి తోడు సమంత సినిమాలు మానేసి పిల్లలు కనాలని ఫ్యామిలీ ఒత్తిడి పెరిగిందని, ఫ్యామిలీ కోసం కెరీర్‌ని త్యాగం చేయలేని స్థితిలో ఏర్పడిన సంఘర్షణ, వివాదాలు వీరి విడాకులకు దారితీశాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

36

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. సమంతకి పనిచేసే డిజైనర్‌ని నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో సమంత తన పర్సనల్‌ డిజైనర్‌ ప్రీతమ్‌ జుకల్కర్‌ అనే వ్యక్తి కాళ్లు పెట్టుకుని ఫోటో దిగడం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఎంత క్లోజ్‌ అయినా అలా ఒకరి మీద కాళ్లు పెట్టుకుని ఫొటో దిగడం అభిమానులకు అంతగా నచ్చలేదు. దీంతో సమంత వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 
 

46

ప్రస్తుతం ఇదే వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సమంత- నాగ చైతన్య విడాకులకు ప్రీతమ్‌ జుకల్కరే కారణం అంటూ నెటిజన్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీనికి తోడు విడాకుల గురించి ప్రకటన రాగానే ప్రీతమ్‌ చేసిన పోస్టులు కూడా పలు అనుమానాలను రేకెత్తిస్తుంది.
 

56

దీంతో అతని ఇన్‌స్టాగ్రామ్‌కు వెళ్లి పాత పోస్టులకు వెళ్లి మరీ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరికి ప్రీతమ్‌ ఘాటుగానే బదులిచ్చినా ట్రోలింగ్‌ మాత్రం ఆగడం లేదు. అయితే నిజానికి ప్రీతమ్‌ సమంతను అక్క అని పిలుస్తాడు. అయినా నెటిజన్లు మాత్రం దారుణంగా ట్రోల్‌ చేస్తుండటంతో చేసేదేమి లేక ప్రీతమ్‌.. తన కామెంట్‌ సెక్షన్‌ని డిసేబుల్‌ చేసేశాడు. 
 

66

ఏదేమైనా టాలీవుడ్‌లో మోస్ట్ లవబుల్‌, రొమాంటిక్‌ కపుల్‌గా ఉన్న సమంత, చైతూ జంట విడాకుల ప్రకటన వారి అభిమానులేకాదు, సాధారణ ఆడియెన్స్  కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే విడిపోయినా తామిద్దరం స్నేహంగానే ఉంటామని, తమ స్నేహాన్ని కొనసాగిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories