అనన్య హీరోయిన్ మెటీరియల్ కాదట, లైగర్ ఫెయిల్యూర్ పాపం ఆమెదేనా...? దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Published : Aug 25, 2022, 02:22 PM IST

తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశమంతా ఎంతో ఉత్కంటతో ఎదురు చూసిన లైగర్ సినిమా రిలీజ్ అయ్యింది. కాని ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే నెగెటీవ్ టాక్ ను మూటగట్టుకుంది. ఇక ముఖ్యంగా ఈ సినిమా ఫెయిల్యూర్ కు కారణం ఏంటీ అని సెర్చ్ మొదలెట్టారు ఆడియన్స్.. అందులో ముఖ్కంగా అనన్య పాండే వారికి అడ్డంగా దొరికిపోయింది. 

PREV
17
అనన్య హీరోయిన్ మెటీరియల్ కాదట, లైగర్ ఫెయిల్యూర్ పాపం ఆమెదేనా...? దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

లైగర్ సినిమాకు సంబంధించిన రకరకాల రివ్యూలు నెట్టింట్ట దర్శనం ఇస్తున్నాయి. అందులో దాదాపు అందరూ ఒకే విధమైన అభిప్రాయాన్నివ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో ఒక్కళ్లిద్దరు మాత్రం ఈసినిమాపై పాజిటీవ్ వైబ్స్ ను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈసినిమా ఫెయిల్యూర్ కు కారణాలు వెతుక్కుంటున్నారు జనాలు. 
 

27

ఇక ఈ విషయంలో అందరూ హీరోయిన్ అనన్య పాండేను టార్గెట్ చేస్తున్నారు. అనన్యను పాయింట్ చేస్తూ.. సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. అసలు ఆమె హీరోయిన్ మెటీరియల్ కాదు అని కొందరు. ఆమెను ఎందుకు తీసుకున్నారు అసలు .. వరస్ట్ ఛాయిస్ అంటూ మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. 
 

37

లైగర్ సినిమాలో ఒక్కోక్కర పెర్ఫామెన్స్ ను గురించి అంచనాలు వేస్తూ.. రమకృష్ణకు ఎక్కువ మార్కులు వేస్తున్నారు ఆడియన్స్. విజయ్ కష్టపడ్డాడు, పూరీ కూడా చాలా ప్రయత్నం చేశాడు. సినిమా చూస్తే వారి కష్టం కనిపించింది. కాని అనన్య పాండే ఈసినిమాకు పెద్ద మైనస్ అంటూ చాలా మంది దుమ్మెత్తి పోస్తున్నారు. 
 

47

మరికోందరైతే.. అసలు ఈ బాలీవుడ్ హీరోయిన్లను ఎందుకు తీసకుంటున్నారు. లైగర్ సినిమా కోసం మీరు తీసకున్న వరస్ట్ ఛాయిస్ అనన్య పాండే. ఆమెకు యాక్టింగ్ రాదు అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆమె నటన చేయకపోగా ఓవర్ యాక్షన్ చేసిందని..  ఆల్ మోస్ట్ ఆడియన్స్ కు నిద్ర వచ్చేలా చేసిందంటున్నారు. 

57

అనన్య పెర్పామెన్స్ డిజాస్టర్ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. మరోసారి తను ఫెయిల్ అయ్యిందంటున్నారు. మీకు ఇంకా ఎవరు దొరకలేదా అంటూ అనన్యపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఇక ఈసినిమా ఈరోజు (25 అగస్ట్ ) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. నెగెటీవుటాక్ ను సొంతం చేసుకుంది. 
 

67

అసలు లైగర్ లో అనన్య పండేను హీరోయిన్ గా అనుకోలేదట దర్శకుడు పూరీ. తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని. అందుకే శ్రీదేవి కూతురు... జాన్వీ కపూర్ ను సౌత్ కు హీరోయిన్ గా పరిచయం చేయాలని.. లైగర్ కోసం అడిగినట్టు పూరీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఆమె డేట్స్ సర్ధుబాటు అవ్వకపోవడంతో.. అనన్యను తీసుకున్నారట పూరీ. 
 

77

అటు ఆడియన్స్ మాత్రం... అసలు బాలీవుడ్ హీరోయిన్లు వద్దే వద్దు.. వారి వల్ల ఉపయోగం లేదు. మన సౌత్ హీరోయిన్ లను తీసుకుని బాగా ఎంకరేజ్ చేయండి అంటున్నారు ట్రోలర్స్. మరి ఈ ట్రోలింగ్ విషయంతో పాటు.. సినిమా ఫెయిల్యూర్ పై లైగర్ టీమ్ ఏం స్పందిస్తారో చూడాలి. 

click me!

Recommended Stories