అంత సీన్ లేదు.. రేణు దేశాయ్ పోస్ట్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు..

Published : Jul 21, 2023, 06:21 PM IST

సోషల్ మీడియాలో హుషారుగా ఉంటుంది పవర్ స్టార్ మాజీ భార్య..రేణు దేశాయ్. ఈసందర్భంగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

PREV
16
అంత సీన్ లేదు.. రేణు దేశాయ్ పోస్ట్ పై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు..
Pawan Kalyan

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్ చల్ చేస్తుంటుంది పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. సోషల్ మీడియాలో తన పిల్లల ఫోటోలు, వారు చేసే వీడియోలు అప్ లోడ్ చేస్తూ.. తనకు సంబంధిచిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు పంచుకుంటుంటుంది రేణు. అంతే కాదు కొంద మంది నెటిజన్లు లేని పోని కామెంట్స్ చేస్తూ.. రేణుని  ఇబ్బంది పెడుతూ ఉంటారు. 
 

26
Pawan Kalyan Heroines

పవన్ కళ్యాణ్ తో చాలా కాలం క్రితం విడాకులు తీసుకుంది రేణు.  ఈమె విడాకులు తీసుకుని చాలా కాలమైనప్పటికీ.. ఇప్పటికీ కొంతమంది వదిన అంటూ.. కామెంట్లు చేయడం ఆమెను చాలా ఇబ్బంది పెడుతుంది. నెట్టింట్లో ఆమెపై కామెంట్లు చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్లు కూడా ఇస్తుంటుంది రేణు దేశాయ్.  

36
Renu Desai

ఇక సోషల్ మీడియాలో అఖీరా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు ఈమె కాస్త డిఫరెంట్ గా కామెంట్లు పెడుతూ.. ట్యాగ్ లైన్స్ రాస్తూ ఉంటుంది.  పవన్ కొడుకు కాబట్టి.. అఖీరాని కొంతమంది జూనియర్ పవర్ స్టార్ అంటుంటారు. అప్పుడు రేణు దేశాయ్ నా బిడ్డను అలా పిలవకండి.. అతనికి సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ లేదు అంటూ అనవసరంగా ప్యాన్స్ ను కదిలిస్తుంటుంది. 
 

46
Renu desai

ఇక రేణు ఇలాంటివి పెట్టినప్పుడు పవర్ స్టార్ ప్యాన్స్ పక్కాగా స్పందిస్తుంటారు. అంతే కాదు చాలా మంది ఆమెపై  సెటైర్లు కూడా వేస్తుంటారు. ఇక అటు రేణు దేశాయ్ వెంటనే  ఎమోషనల్ అవుతూ వాళ్ళ పై మండిపడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా.. తాజాగా రేణు దేశాయ్ ఓ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. 

56
Renu desai

ఇంతకీ ఆమె ఏం పోస్ట్ పెట్టిందంటే... చాలా రోజుల తర్వాత నా ఇన్స్టాగ్రామ్ డాష్ బోర్డును నేను చెక్ చేయడం జరిగింది. నన్ను ఫాలో కానీ మిలియన్ల మంది నా ప్రొఫైల్, పోస్టులను గమనిస్తూ వస్తున్నారు. నన్ను ఫాలో కాకుండా వాళ్లంతా ఎందుకు నా ప్రొఫైల్‌ను చెక్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.. అలా ఎందుకు చేస్తున్నారా? అని ఆలోచిస్తున్నాను అంటూ రేణు దేశాయ్  రాసుకొచ్చింది.
 

66

దాంతో ఆమె పోస్ట్ కి రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..  కొంతమంది పాజిటీవ్ గా స్పందిస్తుంటే.. మరికొంత మంది నెగెటీవ్ గా స్పందిస్తున్నారు. అంత సీన్ లేదు. ఎక్కువ ఫాలోవర్స్ లేకపోయినా.. రీల్స్‌ కి ఎక్కువ సజెషన్స్ జరిగి రీచ్ పెరుగుతుంది. మీ కోసమే మీ ప్రొఫైల్ ను చెక్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండరు అంటూ సెటైర్లు పేల్చుతున్నారు నెటిజన్లు. మరి వారికి రేణు ఏమని కౌంటర్లు ఇస్తుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories