మహేశ్ బాబు స్వీట్ డాటర్ సితారపై నెటిజన్స్ ఫైర్.. ఇంతకీ స్టార్ కిడ్ ఏం చేశారంటే..

First Published | Apr 9, 2023, 1:30 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దుల కూతురు సితార (Sitara) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటుంది. కానీ తాజాగా మాత్రం స్టార్ కిడ్ చేసిన పనికి ఓ నెటిజన్ ఫైర్ అయ్యారు.
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కూతురుగా సితార ఘట్టమనేని అందరికీ పరిచయమే. స్టార్ కిడ్ గానే కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకంటూ క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇందుకోసం రీల్స్, ఫొటోషూట్లు, టూర్స్ కు సంబంధించిన పిక్స్ ను పంచుకుంటూ వస్తుంది. 
 

సితారా ప్రస్తుతం స్కూలింగ్ చేస్తున్నారు. ఇటు చదువుతో పాటు సోషల్ మీడియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటోంది. సితారా చదువు, డాన్స్, ఆటల్లోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పుడూ ఇన్ స్టాలో క్రేజీ పోస్టులు పెడుతూ తన ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తుంటుంది.
 


మరోవైపు బ్యూటీఫుల్ లుక్ లో ఫొటోషూట్లు కూడా చేస్తుంటారు సితార. రీసెంట్ గా ఫెస్టివల్ కు కుందనపు బొమ్మలా తయారై మహేశ్ బాబు అభిమానులతో పాటు తన ఫాలోవర్స్ తోనూ ఆకట్టుకుంది. ఎప్పుడూ సితార తనదైన శైలిలో అట్రాక్ట్ చేస్తూనే ఉంటారు.  
 

కానీ తొలిసారిగా తను పంచుకున్న ఫొటోలనను చూసి నెటిజన్స్ తప్పు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  ఇంతకీ సితార ఏం చేశారంటే.. కారు విండో నుంచి తల బయటకు పెట్టి.. ఫొటోలకు ఫోజులిచ్చింది. క్యూట్ స్మైల్ తో ఆకట్టుకుంది. అయితే ఈ పిక్స్ ను చూసిన కొందరు నెటిజన్లు పలు రకాలుగా సూచనలు చేస్తున్నారు. 

‘నువ్వు ఎందికాలా చేశావు. నిన్ను చూసి చాలా మంది అలానే చేస్తారు. ట్రాఫిక్ లో రోడ్డుమీద పిల్లలు ఇలా ఫోజులిస్తే.. జరగరాని ఏదైనా జరిగిందంటే వాళ్ల కుటుంబాలు ఎంతలా భాదపడతాయి? నువ్వు  పెట్టే ఎలాంటి పోస్ట్ అయినా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి.’ అంటూ సూచించారు. ఎంతనైనా సితార స్టార్ కిడ్ కావడం విశేషం.  అందుకే నెటిజన్స్ ఇలా కామెంట్ చేశారని తెలుస్తోంది.
 

మరికొందరు మాత్రం సితార క్యూట్ లుక్ ను పొగుడుతున్నారు. తండ్రి మహేశ్ బాబు పోలికలతో ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుందనని  అంటున్నారు. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. సితార ఇప్పటికే తండ్రి నటించిన ‘సర్కారు వారి పాట’లో సూపర్ డాన్స్ తో అదరగొట్టింది. తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను వెండితెరపై అలరించారు.
 

Latest Videos

click me!