కూర్గి స్టైయిల్ లో మెరిసిపోతున్న రష్మిక మండన్న.. తన పిక్స్ పై తానే కామెంట్ చేసుకున్న ‘నేషనల్ క్రష్’..

Published : May 22, 2022, 01:47 PM ISTUpdated : May 22, 2022, 01:51 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మండన్న (Rashmika Mandanna) క్రేజ్ ఏ లెవల్ లో ఉంటుందో తెలిసిందే. స్క్రీన్ పై మెరిసినా, నెట్టింట తళుక్కుమన్నా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతుంటారు. తాజాగా తన ఫ్రెండ్ వెడ్డింగ్ లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఆ పిక్స్ కు ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్  కూడా ఇచ్చిందీ బ్యూటీ. 

PREV
16
కూర్గి స్టైయిల్ లో మెరిసిపోతున్న రష్మిక మండన్న.. తన పిక్స్ పై తానే కామెంట్ చేసుకున్న ‘నేషనల్ క్రష్’..

రష్మిక మండన్న టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అతికొద్ది కాలంలోనే నేషనల్  క్రష్ గా పేరొందింది. యువత కలల రాణిగా మారింది. రష్మిక వరుస చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల బాలీవుడ్ కు కూడా ఎంట్రీ  ఇచ్చిన ఈ బ్యూటీ పాపులారిటీ తారా స్థాయికి చేరింది.
 

26

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక ఇటీవల తన స్నేహితురాలి పెళ్లికి కూడా హాజరైంది. ఈ సందర్బంగా కూర్గి స్టైల్‌లో చీరకట్టి అందరి చూపును ఆకర్షిచింది. కర్ణాటకలో జరిగిన ఈ పెళ్లి సందడిలో రష్మిక తన స్నేహితులతో కలసి రచ్చరచ్చ చేసింది. ఆ పిక్స్ ఇటీవల నెట్టింట వైరల్ గా మారాయి.
 

36

తన స్నేహితురాలు రాగిణి ముద్దయ్య పెళ్లికి హాజరై కూర్గి స్టైల్‌లో చీరకట్టడంతో అందరి చూపులు రష్మికపైనే పడ్డాయి. అయితే ఆ పిక్స్ ను తాజాగా మరోసారి పంచుకుందీ బ్యూటీ.  గోల్డ్ కలర్‌ శారీలో రష్మిక మెరిసిపోతోంది.  ఫ్రెండ్‌ మ్యారేజ్‌ కావడంతో వారి సొంత ట్రెడిషన్‌లోకి మారిపోయిందీ బ్యూటీ. సంప్రదాయ దుస్తుల్లో రష్మికను చూసేందుకు రెండు కండ్లు సరిపోవడం లేదు. 
 

46

అయితే ఈ చిత్రాలను పంచుకుంటూ రష్మిక షాకింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ‘నేను కేవలం అలా ఉన్నానంతే.. ఫొటోలకు సరిపోయేలా లేను’ అంటూ తన అవుట్ ఫిట్ ను ఉద్దేశించి చెప్పుకొచ్చింది. తాజాగా  ఫ్రెండ్ వెడ్డింగ్‌ ఈవెంట్‌లో రష్మిక దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకోగా.. ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. 

56

సోషల్ మీడియాలో రష్మికను  కొత్త లుక్ ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొడుగుతూ కామెంట్ చేస్తున్నారు. వామ్మో ఇదెక్కడి అందం అంటూ రష్మికని చూస్తూ మైమరిచిపోతున్నారు. మరికొందరు లైక్ లతో రష్మిక గ్లామర్ కు ఓటేస్తున్నారు. దీంతో రష్మిక ఎలాంటి సందర్భాన్నానైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మేటీ అని చెప్పొచ్చు. 
 

66

కేరీర్ విషయానికొస్తే.. చివరిగా రష్మిక పుష్ఫ : ది రైజ్ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు  అర్జున్  సరసన నటించింది. ప్రస్తుతం తెలుగులో Pushpa : The Rule లో నటిస్తోంది. అలాగే ‘సీతా రామం’లోనూ మెరియనుంది. ఇక హిందీలో ‘యానిమల్‌’, ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌బై’ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తోంది. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్‌ 66వ చిత్రానికి హీరోయిన్ గా కూడా కన్ఫమ్ అయిన విషయం తెలిసిందే.  

click me!

Recommended Stories