ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ 39వ జన్మదిన వేడుకలు జరిగాయి. అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ బర్త్ డేని సెలెబ్రేట్ చేశారు. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు.
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ 39వ జన్మదిన వేడుకలు జరిగాయి. అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ బర్త్ డేని సెలెబ్రేట్ చేశారు. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రెండు భారీ చిత్రాలకు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.
26
ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల దర్శకత్వంలో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. ఈ రెండు చిత్రాల అప్డేట్స్ తో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
36
ఇక సోషల్ మీడియాలో చాలా మంది సెలెబ్రిటీలు ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. కానీ బృందావనం చిత్ర దర్శకుడు వంశీ పైడి పల్లి నేరుగా ఎన్టీఆర్ ఫ్యామిలీతోనే బర్త్ డే సెలబ్రేషన్ నిర్వహించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
46
వంశి పైడిపల్లి ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. వంశీ ఆప్యాయంగా ఎన్టీఆర్ ని హగ్ చేసుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్, వంశి కాంబినేషన్ లో 2010లో బృందావనం చిత్రం వచింది.
56
ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆ మూవీ విపరీతంగా ఆకట్టుకుంది. బృందావనం చిత్రం మంచి విజయం సాధించింది. కానీ ఆ మూవీ తర్వాత మరోసారి వంశీ, ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ కాలేదు.
66
ఎన్టీఆర్ బర్త్ డే ని వంశీ స్వయంగా సెలెబ్రేట్ చేయడంతో త్వరలో వీరిద్దరి కాంబినేషన్ సెట్ కాబోతోందా అనే రూమర్స్ కూడా జోరందుకున్నాయి. ప్రస్తుతం వంశీ.. దళపతి విజయ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కి కూడా కమిట్మెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. సో ఇప్పట్లో వీరిద్దరి కాంబో ఉండే అవకాశాలైతే లేవు.