
ఇది అమెరికన్ వాంపైర్ హారర్ కామెడీ చిత్రం. అండర్ వరల్డ్ డాన్ 12 ఏళ్ల కూతురును నేరస్థులు కిడ్నాప్ చేసి ఒక నిర్జన భవనంలో ఉంచడంతో కథ మొదలవుతుంది. అక్కడ ఒక వాంపైర్ ఉందని తెలుసుకున్నప్పుడు నేరస్థుల ప్రణాళికలు విఫలమవుతాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లో ఉంది.
ఈ జర్మన్ ఎరోటిక్ థ్రిల్లర్ కథ ప్రకారం లిల్లీ తన సోదరి వలేరియాను కలవడానికి వెళ్లి, ఆమెకు ఫ్రెంచ్ కి చెందిన అబ్బాయి మనుతో నిశ్చితార్థం జరిగిందని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. ఆమె మను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఈలోగా ఆమె చాలా ఆకర్షణీయంగా ఉన్న టామ్‌ను కలుస్తుంది. ప్రేమ, అభిరుచి, మోసం కథ ఇక్కడ మొదలవుతుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో టాప్ 9లో ఉంది.
ఇది బ్రిటిష్ కామెడీ క్రైమ్ చిత్రం. దీనిలో నలుగురు రిటైర్డ్ వ్యక్తులు వినోదం కోసం పాత హత్య కేసులను పరిష్కరిస్తారు. కానీ వారు నిజమైన మిస్టరీలో చిక్కుకున్నప్పుడు కథలో ట్విస్ట్ వస్తుంది. అదే ఇందులో హైలైట్. ఈ మూవీ టాప్ 8లో ఉంది.
ఇది దక్షిణ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం. ప్రేమలో ఉన్న టీనేజ్ అమ్మాయి తన వంకర జుట్టును చక్కగా చేసుకుని, పాఠశాలలో అందమైన అబ్బాయి హృదయాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నించడం ఈ చిత్ర కథ. ఆద్యంతం రొమాంటిక్‌గా సాగే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో 7వ స్థానంలో ఉంది.
ఇది విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన పౌరాణిక హర్రర్ మూవీ. కాజోల్ నటించిన ఈ చిత్రం తన కూతురిని రక్షించడానికి కాళిగా మారి రాక్షసుడితో పోరాడే తల్లి కథను చెబుతుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో టాప్ 6లో ఉంది.
సుదీష్ శంకర్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ఇది. వడివేలు, ఫహద్ ఫాజిల్ నటించిన ఈ చిత్రం అల్జీమర్స్ ఉన్న వైలాయుధంను దోచుకోవాలనుకునే దయ అనే దొంగ చుట్టూ తిరుగుతుంది. వారి జీవితాలు ఎలా మారిపోయాయి? ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది ఇందులో ఆసక్తికరం. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5లో ఉంది.
ఇది అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ డ్రామా. కుంగ్ ఫూలో ప్రతిభావంతుడైన లీ ఫాంగ్ తన తల్లితో న్యూయార్క్‌కు వెళ్లి, కొత్త క్లాస్‌మేట్స్‌తో కలిసిపోవడానికి, గతాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఈలోగా అతను కరాటే పోటీలో పాల్గొంటాడు. కానీ అతనికి తెలిసినది ఈ పోటీకి సరిపోదు. లీ ఎలా ముందుకు సాగుతాడు, పోటీకి ఎలా సిద్ధమవుతాడో చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. ఇది టాప్ 4లో ట్రెండ్ అవుతుంది.
ఇది జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం. దీనిలో మనుషీ చిల్లర్, నీరూ బాజ్వా వంటి నటులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. అరుణ్ గోపాలన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2012 ఢిల్లీ బాంబు దాడి వెనుక ఉన్న నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించే పోలీస్ అధికారి కథ. కానీ దేశం అతన్ని ఒంటరిగా వదిలేస్తుంది, అతను ఇరాన్ లక్ష్యంగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరం. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో టాప్ 3లో ఉంది.
అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నలుగురు జంటల సంబంధాల చిక్కుముడులు, వారి జీవిత భావోద్వేగాల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం నగర సంబంధాల వాస్తవికత, సంక్లిష్టతను చక్కగా తెలియజేస్తుంది. సారా అలీ ఖాన్, ఆదిత్య రాయ్ కపూర్, ఫాతిమా సనా షేక్, అలీ ఫజల్, కొంకణ సేన్ శర్మ, పంకజ్ త్రిపాఠి, నీనా గుప్తా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది నెట్ ఫ్లిక్స్ లో టాప్ 2లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తెలుగు చిత్రమిది. దీనికి గౌతమ్ తిన్నమూరి దర్శకత్వం వహించారు. ఒక సిండికేట్‌ను నిర్మూలించడానికి శ్రీలంకకు రహస్య మిషన్‌లో వెళ్లే అండర్‌కవర్ కానిస్టేబుల్ కథ ఇది. అక్కడ అతను తన దూరమైన సోదరుడిని కలుస్తాడు. ఆ తర్వాత నాయకుడిగా ఎలా ఎదిగాడనేది ఈ మూవీలో ఆసక్తికరం. ఇదిప్పుడు ఇండియా వైడ్‌గా నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1గా ట్రెండ్ అవుతుండటం విశేషం.