నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి వేడుక ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా, ఘనంగా జరిగింది. అయితే వీరి మ్యారేజ్ వీడియో విషయంలో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లుగా పరిణామాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
క్రేజీ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ గత నెలలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఏడేళ్ల సహజీవనానికి తెరదించుతూ వీరిద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక మహాబలిపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి చిత్ర పరిశ్రమ నుంచి అతిరథమహారధులు హాజరయ్యారు.
27
నయనతార, విగ్నేష్ శివన్ పెళ్లి వేడుక ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ఘనంగా జరిగింది. అయితే వీరి మ్యారేజ్ వీడియో విషయంలో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లుగా పరిణామాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విగ్నేష్ శివన్, నయనతార తమ వివాహ వేడుక వీడియో టెలికాస్ట్ చేసే హక్కులని ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థకి భారీ ధరకి అమ్మేశారు.
37
Image: Vignesh Shivan/Instagram
సినిమాటిక్ లెవల్ లో వీడియో రూపకల్పన కోసం ఆ బాధ్యతని ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి అప్పగించారు. అంతా బాగానే జరిగింది. కానీ మ్యారేజ్ వీడియో టెలికాస్ట్ చేసే సమయానికి నెట్ ఫ్లిక్ సంస్థ ఒప్పందం రద్దు చేసుకుని నయన్, విగ్నేష్ కి బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
47
మ్యారేజ్ వీడియో టెలికాస్ట్ చేసే ఒప్పందాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. వివాహం జరిగి నెల కూడా గడవక ముందే విగ్నేష్ శివన్ కీలకమైన పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ విషయంలో నెట్ ఫ్లిక్ సంస్థ తీవ్ర అసంతృప్తితో ఉందట. ఒప్పందం రద్దు చేసుకోవడానికి కారణం ఇదే అంటున్నారు. నయన్ వివాహానికి రజనీకాంత్, షారుఖ్ లాంటి పెద్ద సెలెబ్రిటీలు హాజరయ్యారు. వారి ఫోటోలని కూడా విగ్నేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
57
ఇంకా ఆలస్యం చేస్తే తమ వివాహంపై అభిమానుల్లో ఉన్న ఆసక్తి పోతుందని అందుకే షేర్ చేసినట్లు నయన్, విగ్నేష్ తెలిపారట. కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒప్పందం రద్దు చేసుకోవడంతో ఈ సెలెబ్రిటీ కపుల్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.
67
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. నయన్, విగ్నేష్ వివాహ వేడుకకి అధిక మొత్తం ఖర్చుని నెట్ ఫ్లిక్స్ సంస్థ భరించినట్లు తెలుస్తోంది. నయన్ వివాహ వేడుకని టెలికాస్ట్ చేసే హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ 25 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ ని నెట్ ఫ్లిక్స్ వెనక్కి తీసుకుంది.
77
పెళ్లిలో ఒక్కో ప్లేట్ భోజనంకి రూ 3500 నెట్ ఫ్లిక్స్ సంస్థ ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అలాగే హోటల్ బుకింగ్స్, మేకప్ ఆర్టిస్ట్ లు, సెక్యూరిటీ మొత్తం నెట్ ఫ్లిక్స్ సంస్థే చూసుకునట్లు తెలుస్తోంది. పెళ్లి వీడియోని గౌతమ్ వాసుదేవ్ డైరెక్షన్ లో ఆయన టీం షూట్ చేశారు.