ఇక వీరి స్కిట్ సరదా సరదాగా ముగిసినట్లుంది. అనంతరం జడ్జ్ ఇంద్రజ వెంకీని తన పెళ్లి గురించి అడిగారు. తమది లవ్ మ్యారేజ్ అని వెంకీ తెలియజేశారు. తాను కూచిపూడి డాన్సర్, నేను మిమిక్రీ ఆర్టిస్ట్. ఓ ఈవెంట్ సందర్భంగా కలిసి తమ మధ్య పరిచయం ఏర్పడడం, అది పెళ్లికి దారి తీసినట్లు వెంకీ వెల్లడించారు. ఇక తన ఇద్దరు పిల్లలను కూడా జబర్దస్త్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు.