షాక్ : కంగనా 'ఎమర్జెన్సీ' తో నెట్ ప్లిక్స్ కు 80 కోట్లు నష్టం?

Netflix:  నెట్‌ఫ్లిక్స్ కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా  బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి.ఈ చిత్రం  రైట్స్ ని 80 కోట్లకు కొనుగోలు చేసి భారీ నష్టాన్ని చవిచూసిందని బాలీవుడ్ అంటోంది. 

Netflix Costliest Mistake:kangana ranaut emergency? in telugu


Netflix:  ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏమిటి అంటే నెట్  ప్లిక్స్ ఎమర్జెన్సీ సినిమాతో బారీగా డబ్బులు పోగొట్టుకొన్నదని.  బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency Movie) .

పలుమార్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్‌ వద్ద కేవలం రూ.21 కోట్లు మాత్రమే రాబట్టింది. రీసెంట్ గా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.  ఎమర్జెన్సీ మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తోందని ప్రకటన వచ్చింది.

Netflix Costliest Mistake:kangana ranaut emergency? in telugu


అయితే ఇప్పుడు అనుకున్న సమయంకంటే ముందే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ కూడా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.

అయితే త్వరలోనే తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం. ఎమర్జెన్సీ సినిమాలో ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించగా, జయప్రకాశ్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీగా శ్రేయాస్‌ తల్పడే నటించారు. వీరితో పాటు మహిమా చౌదరి, మిలింద్ సోమన్, సతీష్ కౌశిక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.


Netflix Costliest Mistake:kangana ranaut emergency? in telugu


ఎమర్జెన్సీ సినిమా  రైట్స్ ని నెట్ ప్లిక్స్  80 కోట్లకు తీసుకుందిట. ఇంత డిజాస్టర్ సినిమాని ఈ రేటుకు తీసుకోవటం ఏమిటనేది ఓ షాక్. అలాగే ఈ సినిమాని కేవలం 60 కోట్లుతో మాత్రమే నిర్మించారని, అలాంటప్పుడు ఏరి కోరి మరీ అంత రేటు ఎందుకు ఇచ్చారనేది హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా వేరే ఇతర రాజకీయ కారణాలతో తీసుకుని ఉండవచ్చని, కంగనాకు పెద్ద వాళ్ల సపోర్ట్ ఉందనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఎందుకంటే ఎమర్జెన్సీ సినిమా వల్ల నెట్ ప్లిక్స్ కు ప్రత్యేకంగా ఒరిగేమీ లేదు.

సబ్ స్కైబర్స్ పెరగరు, వ్యూయర్ షిప్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. అలాగే టాప్ 10 సినిమాల్లో ఇది నిలబడటం కష్టమే అని ట్రేడ్ అంటోంది. అంటే దాదాపు 80 కోట్లు నష్టమే అని అంటున్నారు. 
 
  

Netflix Costliest Mistake:kangana ranaut emergency? in telugu


ఎమర్జెన్సీ కథ
ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్‌ బ్లూస్టార్‌ వంటి సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కంగనా.. ఇందిరాగాంధీగా నటించింది. అనుపమ్‌ ఖేర్‌, శ్రేయాస్‌ తల్పడే, విశాక్‌ నాయర్‌, మిలింద్‌ సోమన్‌ సహా దివంగత నటుడు సతీశ్‌ కౌశిక్‌ ముఖ్య పాత్రలు పోషించారు. కంగనా ఈ చిత్రానికి నిర్మాతగానూ వ్యవహరించింది.

Latest Videos

click me!