జూనియర్ ఎన్టీఆర్ లైనప్ లో మరో పాన్ ఇండియా డైరెక్టర్.. ఆయన తప్ప అంతా క్యూ కడుతున్నారే ?

దేవర చిత్రం ఆశించిన స్థాయిలో కాకున్నా మంచి హిట్టే అయింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దీనితో ఈ చిత్రం దాదాపు 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

దేవర చిత్రం ఆశించిన స్థాయిలో కాకున్నా మంచి హిట్టే అయింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. దీనితో ఈ చిత్రం దాదాపు 350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. అయితే అంచనాలని పూర్తి స్థాయిలో ఈ చిత్రం అందుకోలేదు. సెకండ్ హాఫ్ విషయంలో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం దక్కింది. 

ఇక తారక్ నటించబోయే తదుపరి చిత్రాల సంగతి ఏంటి అంటూ ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, మైత్రి మూవీస్ నిర్మాణంలో ఒక చిత్రం లాంచ్ అయింది. 


దేవర 2 ఎలాగు ఉంటుంది. అయితే వెంటనే ప్రారంభిస్తారా.. ప్రస్తుతం తారక్ కమిటై ఉన్న చిత్రాలు పూర్తి చేశాక ప్రారంభిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇంతలో ఎన్టీఆర్ గురించి ఒక క్రేజీ గాసిప్ వైరల్ అవుతోంది. ఇటీవల తమిళ దర్శకులు ఎక్కువగా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. 

దేవర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తారక్ తనకి తమిళ దర్శకుడు వెట్రి మారన్ దర్శకత్వంలో నటించాలని ఉంది అనే కోరికని బయట పెట్టారు. అయితే వెట్రిమారన్ కాదు కానీ మరో తమిళ దర్శకుడు ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జైలర్ చిత్రంతో నెల్సన్ దిలీప్ కుమార్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. రీసెంట్ గా నెల్సన్.. అనిరుద్ రవిచంద్రన్ సహాయంతో ఎన్టీఆర్ ని కలిశారట. ఎన్టీఆర్ తో ఒక పాన్ ఇండియా కథ ఐడియాని నెల్సన్ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాధమికంగా జరిగిన చర్చలు కాబట్టి ఇంకా ఏది ఫైనల్ కాలేదు. 

Latest Videos

click me!