నేహాశెట్టి చీరకట్టుకు మన్మథుడైనా మైమరిచిపోవాల్సిందే.. అప్పట్నుంచి అదే పట్టుకుందిగా..

First Published | Nov 1, 2023, 10:19 AM IST

యంగ్ హీరోయిన్ నేహా శెట్టి ఆ చీరకట్టు విధానంతో ఎప్పుడూ మెస్మరైజ్ చేస్తూనే వస్తోంది. బ్యూటీఫుల్ శారీలో అదిరిపోయే ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ తో చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

వరుస చిత్రాలతో నేహా శెట్టి (Neha Shetty)  టాలీవుడ్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ‘బెదురులంక2012’, ‘రూల్స్  రంజన్’ చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ అలరించింది. తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 
 

ప్రస్తుతం ‘రూల్స్ రంజన్’ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తన సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు నేహాశెట్టి సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. 


తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ శారీలో అదిరిపోయేలా ఫొటోషూట్ చేసింది. కొద్దికాలంగా నేహా  శెట్టి చీరకట్టులోనే దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. అయితే నేహాశెట్టి చీరకట్టు విధానం ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు చీరకట్టినా ఆ చిత్రంలోని  స్టైల్ నే ఫాలో అవుతోంది. 

నేహాకు ‘డీజే టిల్లు’తో మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. ‘రాధిక’ పాత్రలో మెస్మరైజ్ చేసింది. తన పెర్ఫామెన్స్ తో పాటు నేహాశెట్టి ఈ పాత్రలో బ్లాక్ శారీలో ఎక్కువ సేపు స్క్రీన్ పై సందడి చేస్తుంది. ఇక ఆమె చీరకట్టు విధానం చాలా మంది ఆడియెన్స్ ను ఫిదా చేసింది.
 

ఇక అప్పట్నుంచి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు చీరకట్టినా ‘డీజే టిల్లు’ రాధికను గుర్తుచేస్తూనే ఉంది. బ్యూటీఫుల్ శారీల్లో మంత్రముగ్ధులను చేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే తన ఫొటోషూట్లతో లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తే బాగుంటుందేమో.. తాజాగా స్కై బ్లూ ట్రాన్స్ ఫరెంట్ శారీలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది.
 

చీరకట్టులో నేహాశెట్టి సొగసుల ప్రదర్శనకు మన్మమథుడైనా మైమరిచిపోవాల్సిందేనంటున్నారు. మత్తెక్కించే ఫోజులతో రాధిక అందాల విందుకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఫొటోలను లైక్ చేస్తూ నెట్టింట వైరల్ గా మారుస్తున్నారు. నేహా ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నటిస్తోంది.
 

Latest Videos

click me!