వసంత్ యష్ ని పక్కకు తీసుకువెళ్లి మీ కోసం రూమ్ బుక్ చేశాను అంటూ రిసిప్ట్ ఇస్తాడు. కంగారుగా దాన్ని జేబులో పెట్టేస్తాడు యష్. ఏంటది అని అందరూ అడుగుతారు కానీ అబద్ధం చెప్తారు ఇద్దరూ. వసంత్ వాళ్ళు హనీమూన్ కి వెళ్ళిపోతారు. ఇక పేపర్ నాకు ఇవ్వండి అంటుంది వేద. వద్దు ఆఫీసుకు సంబంధించింది కదా నేను చూసుకుంటాను అని మాట దాటవేస్తాడు యష్. ఆ తర్వాత వేద ని గుడికి తీసుకెళ్తాను అని సులోచన, షాపింగ్ తీసుకెళ్తాను అని మాలిని, హాస్పిటల్ కి తీసుకు వెళ్తాను అని రత్నం ముగ్గురు గొడవ పడతారు.