నయనతార సంచలన నిర్ణయం.! నిజమైతే, లేడీ సూపర్ స్టార్ అభిమానులకు భారీ షాకే?

Published : Sep 03, 2022, 11:21 AM ISTUpdated : Sep 03, 2022, 11:24 AM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara) తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తన అభిమానులు ఇప్పటికే ఆ వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారు. అదే నిజమైతే భారీ షాక్ అనే చెప్పాలి.  

PREV
16
నయనతార సంచలన నిర్ణయం.! నిజమైతే, లేడీ సూపర్ స్టార్ అభిమానులకు భారీ షాకే?

సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. బడా హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ కు ఉంది. ఆమె సినిమాలను ఆదరించే వారి సంఖ్యా ఎక్కువే. బెంగళూరుకు చెందిన నయన్ తక్కువ వయస్సులోనే  సినీ కేరీర్ ను ప్రారంభించింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 50కిపైగా చిత్రాల్లో నటించింది.
 

26

దాదాపు 20 ఏండ్లపాటు సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించిన ఈ బ్యూటీ ప్రస్తుతమూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. చివరిగా తమిళ చిత్రం ‘కాతువాకుళ రెండు కాదల్’, ‘ఓ2’, చిత్రాలతో అలరించింది. వచ్చేఏడాది వరకూ ఈ  బ్యూటీ వెండితెరపై అభిమానులను, ప్రేక్షకులను అలరించనుంది. ఈ క్రమంలో నయన తార గురించి ఓ షాకింగ్ న్యూస్ ఇంటర్నెట్ లో తెగ ప్రచారం అవుతోంది.
 

36

ఇటీవలనే దర్శకుడు విగ్నేష్ శివన్ (Vignesh Shivan)తో గ్రాండ్ గా నయన్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటు ప్రేమాయణం కొనసాగించి, ఎట్టకేళలకు ఈ ఏడాది ఒక్కటయ్యారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై తన వివాహ జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు సినిమాలకు గుడ్ బై చెబుతున్నదంంటూ నెట్టింట తెగ ప్రచారం జరుగుతోంది. 
 

46

ఇప్పటికే భర్తతో కలిసి విదేశాల్లో ఎంచక్క ఎంజాయ్ చేస్తున్న నయనతార ఇకపైనే అలాంటి జీవితాన్నే కోరుకుంటోందంట. సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నదంటూ కొందరు చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు నయనతార మాత్రం ఈ విషయంపై స్పందించలేదు. 
 

56

కానీ పెళ్లి తర్వాత సౌత్ ఇండస్ట్రీలోని చాలా మంది హీరోయిన్లు తమ నటన జీవితానికి దూరమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇండస్ట్రీలో వెలుగొందుతున్న నయనతార కూడా అదే బాటలో పయనిస్తుందని గట్టిగానే ప్రచారం జరుగోతంది. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు నిరాశే ఎదురవుతుంది. విభిన్న పాత్రలతో వెండితెరపై మెరిసి.. నటన, గ్లామర్  పరంగా అలరించిన నయన్ తీసుకున్న నిర్ణయం సంచలనమనే చెప్పాలి. 

66

మరోవైపు నటనా జీవితాన్ని నయనతార దూరమైతే ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తబోతుందంటున్నారు. ప్రేక్షకాదరణ పొందే  సినిమాలను చిత్రించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై నయనతారా స్పందిస్తేగానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఏదేమైనా నయన్ మాత్రం భర్త విగ్నేష్ తో కలిసి ఫారెన్ టూర్స్ ను ఎంజాయ్ చేస్తోంది. 
 

click me!

Recommended Stories