Nayanthara: పెళ్లి కాలేదు కాని .. ఫుల్లుగా తిరిగేస్తున్నారు. పెళ్ళెప్పుడంటే మాత్రం..?

First Published | Jan 3, 2022, 7:21 AM IST

కోలీవుడ్ ప్రేమ పక్షులు నయన తార  విఘ్నేష్ శివన్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ స్టార్ జంట.. మూడు ముళ్ల బంధం పడకుండానే ఫుల్ గా తిరిగేస్తున్నారు.

సౌత్ లేడీ సూపర్ స్టార్ గా దూసుకు పోతోంది నయన తార. ఇటు హీరోయి గా అటు నిర్మాతగా సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తుంది. గత కొన్ని ఏళుగా తమిళ యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతున్న స్టార్ సీనియర్ హీరోయిన్ చెట్టా పట్టాలు వేసుకుని దేశ విదేశాలకు తిరుగుతున్నారు. రీసెంట్ గా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా దగ్గర సందడి చేశారు ఈ జంట. న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా చేసుకున్నారు. 

ప్రపంచ ప్రఖ్యాత భవనం ముందు నించుని ఫోటోలు దిగారు ప్రేమ జంట. కొత్త ఏడాది సంబరాన్ని అక్కడే ఘనంగా జరుపుకున్నారు. ఈ పోటోస్ ను నయన్ ప్రియుడు.. డైరెక్టర్ విఘ్నేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఒక్క టూర్ మాత్రమే కాదు.. ఏక్కడికి వెళ్లినా.. ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో ఇద్దరిలో ఎవరో ఒకరూ అప్ లోడ్ చేస్తునే ఉంటారు.


దాదాపు మూడేళ్లుగా పెళ్ళి కాకుండానే భర్య భర్తల మాదిరి సహజీవనం చేస్తూ.. ఎక్కువగా ఫారెన్ టూర్లలోనే గడిపేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి జంటగా వెళ్తున్నారు. అదిగో పెళ్ళి.. ఇదిగో పెళ్లీ అంటున్నారే కాని.. పెళ్ళి ఎప్పుడూ అనేది మాత్రం కరెక్ట్ గా చెప్పడం లేదు జంట. రీసెంట్ గా ఎవరికి చెప్పకుండా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారట. అటు కోలీవుడ్ లో వీరి సహజీవనం గురించి రకరకాల వర్తలు వినిపిస్తున్నాయి కాని వాటి గురించి ఈ జంట ఇంత వరకూ స్పందించలేదు.

బర్త్ డే పార్టీ అయినా.. ఫెస్టివల్ పార్టీ అయినా.. ఇంకేదైనా ఫంక్షన్ అయినా.. ఏదైనా సరే.. ఇద్దరూ చెట్టా పట్టాలు వేసుకుని వెళ్ళాల్సిందే. ఆ మధ్య   కేరళలో ఓనం పండుగ  జరగితే స్సెషల్ ప్లైట్ మాట్లాడుకుని వెళ్లారు ఇద్దరూ.. అంతకు ముందు కూడా చాలా ఈవెంట్స్ లో ఇద్దరూ సందడి చేశారు. ఏదైనా అకేషన్ వచ్చినా.. ఏదా ఖాళీ టైమ్ దొరికినా.. ఇద్దరూ ఫారెన్ లో వాలిపోతారు. దాదాపు ఏ దేశాన్ని వదిలిపెట్టకుండా.. దాదాపు అన్ని దేశాలు తిరిగి వచ్చారు ఈజంట. త్వరలో పెళ్ళి చేసకుంటాం అంటున్నారు కాని.. ఎప్పుడు చేసుకుంటారో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

గతంలో తమిళ స్టార్ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిన నయనతార. దాదాపు శిబుతో కూడా సహజీవనం చేసింది. కాని వీరిద్దరి ప్రేమ పెటాకులు అయ్యింది. ఇక ఆ మధ్య ఆల్ రెడీ పెళ్ళి జరిగి.. పిల్లలు కూడా ఉన్న స్టార్ డాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో కూడా ప్రేమాయణం నడింపించింది స్టార్ బ్యూటి.. ఈ రిలేషన్ పెళ్ళి వరకూ వచ్చి.. వివాదంతో ముగిసి పోయింది. ఇక ఇప్పుడు విఘ్నేష్ తో అయినా పెళ్ళి వరకూ వెళ్తుందా లేదా అని నెటిజన్లు అనుమానం వ్యాక్తం చేస్తున్నారు.

Latest Videos

click me!