Nayanthara weds Vignesh: నయనతార,విఘ్నేష్ పెళ్ళి ముహూర్తం ఫిక్స్, శ్రీవారి సన్నిధిలో పెళ్ళెప్పుడంటే...?

Published : May 07, 2022, 09:18 AM ISTUpdated : May 07, 2022, 09:53 AM IST

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది. సౌత్ సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతార ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఆమె పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది.   

PREV
15
Nayanthara weds Vignesh: నయనతార,విఘ్నేష్  పెళ్ళి ముహూర్తం ఫిక్స్,  శ్రీవారి సన్నిధిలో పెళ్ళెప్పుడంటే...?

సౌత్ లో పెళ్లి కాని సీనియనర్ స్టార్ హీరోయిన్లలో ముందు వరసలో.. ఫస్ట్ ప్లేస్ లో ఉంది నయనతార. ఇప్పటికే 40 ఏళ్లకు దగ్గర పడుతున్నా ఇంకా పెళ్ళి చేసుకోకుండా.. ఇండస్ట్రీలో బిజీ స్టార్ గా ఉంది. ఇక ఎట్టకేలకు ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. 

25

చాలా కాలంగా తన కంటే చిన్నవాడైన తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతుంది నయనతార. వీరిద్దరు పబ్లిక్ గానే చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. సహజీవనం చేవారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసి వెళ్ళేవారు. ఇక వీరి బంధం స్ట్రాంగ్ అవ్వడంతో.. ఈ ఇద్దరు స్టార్ల పెళ్లి కోసం ప్యాన్స్ కూడా ఎప్పటి నుంచో్ ఎదురు చూశారు. 
 

35

కరోనా కారణంగా తమ పెళ్లి వాయిదా పడుతుంది అంటూ చెప్పుకొచ్చిన నయన్, విఘ్నేష్ లు.. సీక్రేట్ గా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఇక రీసెంట్ గా పెళ్లి తేదీని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శిచుకున్న ఈ స్టార్ జంట.. ఆయన సన్నిధిలోనే పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారట. 
 

45

వచ్చేనెల 9న పెళ్ళి బంధంతో ఈఇద్దరు ఒకటి కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు విఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్న ఈజంట.. ఇక్కడే తిరుమలలో పెళ్ళి చేసుకోబోతున్నారట.  ఈరోజు దర్శంతో పాటు..తమ పెళ్ళికి వేదికను బుక్ చేసుకోవడం కోసం తిరుమలకు వచ్చినట్టు తెలుస్తోంది. 

55

గతంలో రెండు సార్లు నయనతార పెళ్లి చేసుకోబోయి మిస్ అయ్యారు. ఫస్ట్ తమిళ స్టార్ హీర్ శింబుతో.. తరువాత స్టార్ డాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో పీకల్లోతు ప్రేమలో పడ్డ నయన్.. ఆతరువాత కొన్ని పరిస్థితుల వల్ల వారితో బ్రేకప్ చెప్పారు. ఇక ముచ్చటగా మూడోసారి యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ తో ప్రేమలో పడ్డ నయన్.. ఈసారి తమ బంధాన్ని స్ట్రాగ్ చేసుకుంటూ.. పెళ్ళి పీఠల వరకూ వెళ్తున్నారు. 
 

click me!

Recommended Stories